బిజినెస్

మదుపరుల చూపు బడ్జెట్ వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం కూడా ఒడిదుడుకులకు లోనుకావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నా రు. అయితే రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వే ఆధారంగా పెట్టుబడులపై మదుపరుల ఆలోచన మారవచ్చని పేర్కొంటున్నారు. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు, ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు కూడా మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. ‘గ్లోబల్ మార్కెట్ల కదలికలు, ముడి చమురు ధరలు, ఆర్థిక సర్వే, రానున్న రైల్వే బడ్జెట్‌లో ప్రకటించే సంస్కరణలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, ఈ వారంతో ముగియనున్న ఫిబ్రవరి డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.’ అని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ అన్నారు. ముఖ్యంగా డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు తీరిపోనుండటంతో మదుపరులు అమ్మకాలు-కొనుగోళ్ల మధ్య ఊగిసలాటకు గురయ్యే వీలుందని, దీనివల్ల సూచీలకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చనే అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. ‘గురువారంతో డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటం వల్ల మార్కెట్లు ఒడిదుడుకుల్లో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పోకడ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తుంది. ముడి చమురు ధరల కదలికలు, విదేశీ మదుపరుల పెట్టుబడుల తీరు కూడా ప్రధానం.’ అని క్యాపిటల్‌వయా గ్లోబల్ రిసెర్చ్ లిమిటెడ్ డైరెక్టర్ వివేక్ గుప్తా అన్నారు. కాగా, ఈ నెలలో ఇప్పటిదాకా భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు 4,600 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో అదేపనిగా పడిపోతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ ఆర్థిక మందగమనం భయాలే దీనికి కారణం. ఇకపోతే వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్‌పైనే మదుపరుల చూపంతా ఉందని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అభిప్రాయపడ్డారు. మంగళవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతుండగా, 25న రైల్వే బడ్జెట్, 29న జనరల్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలో రైల్వే బడ్జె ట్ కారణంగా ఉక్కు, సిమెంట్, బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువుల రంగాలకు చెందిన షేర్లు ప్రభావితమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే సాధారణ బడ్జెట్‌లో వృద్ధికారక సంస్కరణలు, పన్ను మినహాయింపులు ఇలాంటి వాటిపై మదుపరులు ఆసక్తిగా చూస్తున్నారని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రిసెర్చ్ అధిపతి, సీనియర్ ఉపాధ్యక్షుడు దీపెన్ షా అన్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 723 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 230 పాయింట్లు పెరిగినది తెలిసిందే.

ఆన్‌టైం ఫెర్‌ఫార్మెన్స్‌లో
స్పైస్‌జెట్ అగ్రస్థానం

హైదరాబాద్, ఫిబ్రవరి 21: దేశీయ ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ సంస్థ స్పైస్‌జెట్ గత నెల జనవరిలో ఆన్‌టైం ఫెర్‌ఫార్మెన్స్‌లో అగ్రస్థానం సాధించినట్లు ప్రకటించింది. తమ బంబార్డియర్ క్యు 400 విమానాల వేగం వృద్ధి చేయడం ద్వారా ఆన్‌టైమ్ ఫెర్‌ఫార్మెన్స్‌లో మెరుగయ్యామని స్పైస్ జెట్ సంస్థ ఫ్లయిట్ ఆపరేషన్స్ సీనియర్ జిఎం రోహిత్‌పాల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తమ నిర్వహణ సామర్థ్యం పెంచుకునేందుకుగాను అన్ని విధాల నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. స్పైస్‌జెట్ టీమ్ అంతా మనస్ఫూర్తిగా స్థిరమైన వృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్) 2015 డిసెంబర్ సహా వరుసగా 9 నెలల పాటు 90 శాతం పైగా ఉందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి వరుసగా రెండవ నెల ఈ ఫీట్‌ని ఎయిర్‌లైన్స్ సాధించిందని తెలిపారు.

ఎయిర్‌టెల్ 4జి స్పీడ్ 135 ఎమ్‌బిపిఎస్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. హైస్పీడ్ 4జి మొబైల్ బ్రాడ్‌బాండ్ సేవలను ప్రారంభించినట్లు ఆదివారం తెలిపింది. సెకనుకు 135 మెగాబైట్ల వరకు 4జి మొబైల్ బ్రాడ్‌బాండ్ స్పీడ్ ఉండే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది. అయితే కేరళలోని ఎయిర్‌టెల్ 4జి నెట్‌వర్క్ పరిధిలోని స్మార్ట్ఫోన్లకే వాణిజ్యపరంగా ఈ సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉందని సంస్థ స్పష్టం చేసింది. నోకియా నెట్‌వర్క్స్ భాగస్వామ్యంతో ఈ సేవలను కేరళలో పరిచయం చేసినట్లు వివరించింది.

బడ్జెట్‌లో వృద్ధులకు ఆరోగ్య బీమా?
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: వృద్ధులకు నగదుతో నిమిత్తం లేకుండా ఆరోగ్య బీమాను అందించే పథకంపై కసరత్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దీన్ని రానున్న వార్షిక బడ్జెట్‌లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. ఈ నెల 29న వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) కోసం సాధారణ బడ్జెట్‌ను పార్లమెంట్‌లో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందులో బ్యాంకులు, బీమా సంస్థలు, ఇపిఎఫ్‌ఒ, చిన్న మొత్తాల పొదుపు పథకాల ద్వారా వృద్ధులకు ఆరోగ్య బీమాను 10,000 కోట్ల రూపాయలతో అందించే ప్రతిపాదనను తేనున్నట్లు తెలుస్తోంది.