బిజినెస్

ఎథిలిన్ చాంబర్ల ఏర్పాటుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: కాయలు.. పండ్లుగా మగ్గేందుకు ఎథిలిన్ చాంబర్లను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం హైకోర్టుకు తెలిపాయి. పండ్లుగా మార్చేందుకు వ్యాపారులు ఆరోగ్యానికి హానికరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగిస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలను సుమోటోగా తీసుకుని ఈ అంశాన్ని హైకోర్టు విచారించింది. ఈ కేసును హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ఏ సంజీవ్ కుమార్ వాదనలు వినిపిస్తూ తమ ప్రభుత్వం గడ్డి అన్నారం మార్కెట్ యార్డులో కాయలను పండ్లుగా మగ్గించేందుకు ఎథిలిన్ చాంబర్లను ఏర్పాటు చేయనున్నట్లు, దీని నిమిత్తం రూ. 60 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలియజేశారు. ఈ చాంబర్ కెపాసిటీ 60 మెట్రిక్ టన్నులుగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా నామినల్ చార్జీలను పండ్ల వర్తకుల నుంచి వసూలు చేస్తుందన్నారు. కొంత మంది పండ్ల వర్తకులు ఎథిలిన్ చాంబర్లను సొంతంగా ఏర్పాటు చేసుకుంటామని ముందుకు వచ్చారని, వారికి కూడా స్థలం కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది డి రమేష్ వాదనలు వినిపిస్తూ ఇప్పటికే రాష్ట్రంలో ఏడు ఎథిలిన్ చాంబర్లు ఉన్నాయన్నారు. చిత్తూరులో ఐదు, అనంతపురంలో రెండు చాంబర్లు ఉన్నాయని పేర్కొన్నారు. మరో మూడు చాంబర్లను ఏర్పాటు చేస్తామన్నారు. అంతేగాక 64 చాంబర్లను ప్రైవేట్ వర్తకులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. కాగా, స్థానిక వర్తకులు ఏర్పాటుచేసే ఎథిలిన్ చాంబర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ఆదేశించాలంటూ అమికస్ క్యూరి కోర్టును కోరారు. దీంతో వచ్చే మామిడి పండ్ల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని చాంబర్లను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.