బిజినెస్

సామాన్యుడికీ అర్థమయ్యేలా బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వచ్చే నవ్యాంధ్ర బడ్జెట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండబోతోంది. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా సులభ శైలిలో రూపొందిస్తున్నారు. సోమవారం విజయవాడ ఎ-1 కనె్వన్షన్ సెంటర్‌లో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 2016-17 బడ్జెట్‌లో ప్రతి పుట అందరికీ అర్థమయ్యేలా రూపకల్పన చేస్తున్నట్టు వివరించారు. కొత్త బడ్జెట్ కోసం ప్రతి ప్రభుత్వ శాఖ నుంచి ప్రతిపాదనలు కోరినట్లు, ఇక నుంచి ప్రతి శాఖకు నెలవారీ బడ్జెట్ కేటాయింపులుంటాయని తెలిపారు.
ఏప్రిల్ 1న వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి కేటాయింపులను విడుదల చేస్తామన్నారు. మరోవైపు ఇ-ఆఫీసు వ్యవస్థ ఉండి కూడా ఫైళ్లను అపరిష్కృతంగా ఉంచటంలో అర్థం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సదస్సులో అన్నారు. రికార్డులు, ఫైళ్లన్నింటినీ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో ఉంచాలని అధికారులను కోరారు. కుటుంబంలో ఎవరెవరు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, ఉపకార వేతనాలు, రైతు రుణాలు, రేషన్ సరుకులు తీసుకుంటున్నారో మొత్తం వివరాలు లభ్యమయ్యేలా చూడాలని సూచించారు. ప్రజలు పరిష్కారాలనే కోరుకుంటారు కాని, అధికారులు చెప్పే వివరణలను కాదని అన్నారు. అవినీతి ఏ స్థాయిలోనూ ఉండటానికి వీల్లేదని, ప్రతి పనిలో పారదర్శకత కనిపించాలని, ఐటీ ఇక సొల్యూషన్స్ ఇచ్చే శాఖగా ఉండాలని స్పష్టం చేశారు.
ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చాలి
రాష్ట్రాన్ని ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఫ్లోరైడ్ పీడిత గ్రామాలుగా నమోదైన 335 పల్లెల్లో లభ్యమవుతున్న మంచినీటిని ఫ్లోరైడ్ రహితంగా మార్చేందుకు ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకూడదని, ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడే దుస్థితి ఉండకూడదనీ అధికారులకు ఆదేశాలిచ్చారు.
‘పెమాండు’తో అద్భుత ఫలితాలు: డైరెక్టర్ రవీంద్రన్
ఫెర్మార్మెన్స్ మేనేజ్‌మెంట్ డెలివరీ యూనిట్ (పెమాండు)పై ల్యాబ్ మెథడాలజీపై డైరెక్టర్ రవీంద్రన్ మాట్లాడారు. ‘పెమాండు’ సంస్కరణలతో తాము మలేషియాలో అవినీతిని అత్యంత కనిష్ట స్థాయికి తగ్గించగలిగామని, విద్యావ్యవస్థలో సమూల మార్పులు ప్రవేశపెట్టామని, వైద్య ఆరోగ్య సేవలను పునర్ వ్యవస్థీకరించామని వివరించారు. చిల్లర, గరిష్ట విక్రయాలే ప్రధాన ఆర్థిక చోదకశక్తులని చెప్పారు. ల్యాబ్స్ తరహా సంస్కరణలతో స్వయం సహాయక సంఘాలను, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా, సంఘటిత, అసంఘటిత పరిశ్రమలను పటిష్టం చేయవచ్చన్నారు.
విజ్ఞప్తులు 75.3 శాతం పరిష్కారం
ఐటి సలహాదారు జె సత్యనారాయణ ‘జన్మభూమి గ్రీవెన్స్ సెల్, ఇ-ప్రగతి’పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. జన్మభూమిలో వచ్చిన విజ్ఞప్తుల్లో 75.3 శాతాన్ని పరిష్కరించామన్నారు. ఇ-ప్రగతిపై అవగాహనకు జిల్లా అధికారులతో కార్యశాలలు నిర్వహించాలని ఆయన కోరారు. విశాఖ, కాకినాడ, గుంటూరు, తిరుపతిలో లబ్ధిదార్లతో అవగాహన సమావేశాలు నిర్వహించాలని, అమరావతిలో ఇ-ప్రగతి శాశ్వత సమాచార కేంద్ర నిర్మాణానికి భూమి కేటాయించాలని సత్యనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. మన టీవీని అమరావతి ఇ-ప్రగతి భవనంలోకి తరలిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 5 వేల తరగతి గదులను డిజిటలైజ్ చేశామని, ప్రాధాన్యతా రంగాలన్నింటినీ పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేశామని కూడా ఆయన తెలియజేశారు.

వెయ్యి కోట్ల టర్నోవర్‌పై హెరిటేజ్ ఫుడ్స్ కన్ను
ముంబయి, ఫిబ్రవరి 22: హెరిటేజ్ ఫుడ్స్ 2018-19 ఆర్థిక సంవత్సరానికల్లా వెయ్యి కోట్ల రూపాయల టర్నోవర్‌ను ఆశిస్తోంది. ఇందుకోసం ఏటా 20 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. ఈ మేరకు సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో సంస్థ పేర్కొంది. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లో విస్తరించింది. రాబోయే ఐదేళ్లలో 75 వేల నుంచి లక్ష చదరపు అడుగుల ట్రేడింగ్ స్పేస్‌ను అందిపుచ్చుకుంటామనే ఆశాభావాన్ని హెరిటేజ్ ఫుడ్స్, రిటైల్, బేకరీ విభాగాల సిఒఒ ధర్మేందర్ మటాయ్ వ్యక్తం చేశారు.