బిజినెస్

గల్ఫ్ దేశాల్లో నమ్మకమైన కొలువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద: తెలంగాణలోని నిరుద్యోగులకు వివిధ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టామ్‌కామ్ సంస్థ ద్వారా భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. తాజాగా సోమవారం మరో నాలుగు వందల మందికి ఉద్యోగ హామీ లభించింది. అడ్డదారుల్లో గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లి అక్కడ అమాయకులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చైర్మన్‌గా టామ్‌కామ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టామ్‌కామ్ ఏర్పాటుతో బ్రోకర్ల బారినపడి నిరుద్యోగులు మోసపోకుండా కూడా ప్రభుత్వం నివారించగలుగుతుండగా ఆదివారం కుదిరిన ఒప్పందాల్లో 750 మందికి ఉద్యోగాలు లభించగా, తాజాగా సోమవారం మరో నాలుగు వందల మందికి ఉద్యోగాల కోసం ఒప్పందాలు కుదిరాయి. 750 ఉద్యోగాలకు సంబంధించి దుబాయ్‌లోని అల్ముల్లా గ్రూప్, జంజీరా ఎమిరెట్స్ ద్వారా కంపెనీలతో ఆదివారం ఒప్పందాలు కుదిరాయి. సోమవారం కురుమ్ బిజినెస్ గ్రూప్‌తో అవగాహనా ఒప్పందం కుదిరింది. కురుమ్ గ్రూప్ మానవ వనరుల మేనేజర్ సూరజ్, తెలంగాణ ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టర్ కెవై నాయక్‌లు మంత్రి నాయిని నర్సింహారెడ్డి సమక్షంలో సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. ఈ నాలుగు వందల ఉద్యోగాలను వచ్చే సంవత్సరంలోగా భర్తీ చేస్తారు. షార్జాకు చెందిన మరో ఆయిల్ కంపెనీ ఆల్ టహీర్ చైర్మన్ సులేమాన్ షరీఫ్‌తో మంత్రి చర్చలు జరిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్‌కామ్) ఉద్దేశాలను మంత్రి నాయిని వివరించారు. గల్ఫ్ దేశాలకు వచ్చే యువతకు చట్టపరమైన భద్రత కల్పించడంతో పాటు దుబాయ్‌లోని యాజమాన్యాలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించేందుకు టామ్‌కామ్ ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఐటి, టెలికామ్, హెల్త్‌కేర్, బ్యాంకిం గ్, ఫైనాన్షియల్, ఇన్స్యూరెన్స్, విద్య, మానవ వనరులు, మార్కెటింగ్ , అకౌంటెంట్‌లు, నిర్మాణ రంగంలో నైపుణ్యం కలిగిన యుతవకు అవకాశాలు ఇవ్వడం కోసం టామ్‌కామ్ ప్రయత్నిస్తుందని తెలిపారు. వీటి కోసం వివిధ దేశా ల్లో రోడ్ షోలను ఏర్పాటు చేయడంతోపాటు తరుచుగా విదేశీ కంపెనీలతో సమావేశమమవుతామని మంత్రి చెప్పారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, కార్మిక శాఖ కార్యదర్శి హరిప్రీత్‌సింగ్, టామ్‌కామ్ డైరెక్టర్ భవానీ, శ్రీనివాస శర్మ ఒప్పందాల కార్యక్రమంలో పాల్గొన్నారు.

గల్ఫ్ ప్రతినిధితో టామ్‌కామ్ చైర్మన్ నాయిని నర్సింహారెడ్డి