బిజినెస్

వరుస లాభాలకు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. బడ్జెట్‌కు ముందు ఆర్థిక పరిస్థితులపై మదుపరులలో కొరవడిన స్పష్టత, ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని మొండి బకాయిల భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నాలుగు రోజులుగా లాభాలను అందుకుంటున్న సూచీలు.. విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలతో ఉదయం ప్రారంభం నుంచి నష్టాల్లోనే కదలాడాయి. దేశీయ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు కూడా తోడవడంతో చివరిదాకా అదేదారిలో పయనించాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 378.61 పాయింట్లు పతనమై 23,410.18 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 125 పాయింట్లు క్షీణించి 7,109.55 వద్ద నిలిచింది. ఆయా రంగాలవారీగా రియల్టీ, పిఎస్‌యు, చమురు, గ్యాస్, మెటల్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల విలువ 2.49 శాతం నుంచి 1.70 శాతం మేర పడిపోయాయి. మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ సూచీలు కూడా 1.47 శాతం, 1.25 శాతం చొప్పున దిగజారాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, జపాన్ సూచీలుసహా అన్నీ నష్టపోగా, ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 0.69 శాతం వరకు కోల్పోయాయి. మరోవైపు నిఫ్టీలో కెయిర్న్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వేదాంత షేర్లు మంగళవారం తీవ్రంగా నష్టాలపాలయ్యాయి. కెయిర్న్ ఇండియా 4.24 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3.77 శాతం, వేదాంత 1.41 శాతం చొప్పున పడిపోయాయి. ఏప్రిల్ 1 నుంచి నిఫ్టీకి ఈ మూడు సంస్థలు దూరమవుతున్నది తెలిసిందే. వీటి స్థానంలో అరబిందో ఫార్మా, భారతీ ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్ లిమిటెడ్ చేరుతున్నాయి.
పిఎస్‌యు ఒఎఫ్‌ఎస్ రోజున నష్టాలే!
ప్రభుత్వరంగ సంస్థలు (పిఎస్‌యు) ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్) ద్వారా వాటా విక్రయానికి వచ్చిన రోజు సెనె్సక్స్‌కు నష్టాలే దిక్కవుతున్నాయి. మంగళవారం ఎన్‌టిపిసి ఒఎఫ్‌ఎస్‌కు రాగా, సెనె్సక్స్ 379 పాయింట్లు క్షీణించింది. ఇలా జరగడం ఇది 17వసారి కావడం గమనార్హం. 2013లోనూ ఎన్‌టిపిసి ఒఎఫ్‌ఎస్ రోజున ఇలాగే నష్టపోగా, అంతకుముందు 2012 మార్చి 1 ఒఎన్‌జిసి వాటా విక్రయం రోజునా 169 పాయింట్లు పడిపోయింది. ఇదే క్రమంలో ఐఒసి, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, పిఎఫ్‌సి, కోల్ ఇండియా, సెయిల్, ఐటిడిసి, ఎస్‌టిసి, హిందుస్థాన్ కాపర్, ఎన్‌ఎఫ్‌ఎల్, ఎమ్‌ఎమ్‌టిసి, సెయిల్, నాల్కో, ఆయిల్ ఇండియా, ఎన్‌ఎమ్‌డిసి వాటా విక్రయాలప్పుడూ సెనె్సక్స్‌కు నష్టాలే మిగిలాయి. అయితే ఇఐఎల్, ఆర్‌ఇసి, ఆర్‌సిఎఫ్ వాటాల విక్రయాలకు మాత్రమే సెనె్సక్స్ పెరిగింది. ఇఐఎల్ రోజున 400 పాయింట్లు, ఆర్‌ఇసి రోజున 190 పాయింట్లు, ఆర్‌సిఎఫ్ రోజున 270 పాయింట్లు సెనె్సక్స్ పుంజుకుంది.