బిజినెస్

‘ఫ్రీడమ్’ ఇవ్వకపోతే చర్యలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రపంచ మొబైల్ మార్కెట్‌ను కుదిపేస్తున్న ‘ఫ్రీడమ్ 251’ స్మార్ట్ఫోన్ వ్యవహారాన్ని కేంద్రం నిశితంగా గమనిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌గా ఫ్రీడమ్ 251ను గత వారం భారతీయ మొబైల్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్ మార్కెట్‌కు పరిచయం చేసినది తెలిసిందే. దీని ధర కేవలం 251 రూపాయలు. రెండు రోజులపాటు దీని బుకింగ్స్‌ను రింగింగ్ బెల్స్ స్వీకరించింది కూడా. ఈ క్రమంలో ఈ ఫోన్‌ను బుకింగ్ చేసుకున్నవారికి సంస్థ ఇవ్వలేకపోతే చర్యలు తప్పవని కేంద్ర టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం హెచ్చరించారు. ప్రభుత్వం రాయితీ ఇచ్చినా ఒక స్మార్ట్ఫోన్‌ను 3,500 రూపాయల కంటే తక్కువ ధరకు అమ్మలేమని, అలాంటిది 251 రూపాయలకే అందివ్వడం ఎలా సాధ్యమని, రింగింగ్ బెల్స్ ప్రకటనను లోతుగా పరిశీలించాలని ఇప్పటికే భారత సెల్యులార్ అసోసియేషన్ టెలికామ్ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. బిజెపి ఎంపీ కిరిట్ సోమయ్య సైతం ఇదే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రవిశంకర్ ప్రసాద్ పైవిధంగా స్పందించారు. మరోవైపు ఎక్సైజ్, ఆదాయ పన్ను (ఐటి) శాఖల దృష్టి కూడా రింగింగ్ బెల్స్‌పై పడినది తెలిసిందే. నోయిడాకు చెందిన ఈ సంస్థ ఆర్థికపరమైన అంశాలను ఎక్సైజ్, ఐటి శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కంపెనీ రిజిస్ట్రేషన్ నుంచి ఇతరత్రా అన్ని వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. సంస్థ విశ్వసనీయత గురించి కూడా తెలుసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పటికే టెలికామ్ శాఖ ఆదేశించింది.
కాగా, గత బుధవారం రాత్రి ఇక్కడ ‘ఫ్రీడమ్ 251’ పేరుతో 3జి స్మార్ట్ఫోన్‌ను 251 రూపాయలకే రింగింగ్ బెల్స్ అందుబాటులోకి తీసుకురాగా, దీన్ని బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఆవిష్కరించారు. 4 అంగుళాల స్క్రీన్, క్వాల్‌కమ్ 1.3 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1 జిబి ర్యామ్‌తో దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆండ్రాయిడ్ లాలీపప్ ఆధారిత ఈ స్మార్ట్ఫోన్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం 8 జిబి. దీన్ని 32 జిబి వరకు పెంచుకోవచ్చు. 3.2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉన్నాయి. 1,450 ఎమ్‌ఎహెచ్ బ్యాటరీ దీని సొంతం. ఉమెన్ సేఫ్టీ, స్వచ్ఛ్ భారత్, ఫిషర్‌మెన్, ఫార్మర్, మెడికల్, వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సౌకర్యాలన్నీ ఇందులో ఉన్నాయి. గురువారం ఆరంభించిన ఈ ఫోన్ బుకింగ్స్‌లో ఊహించినదానికంటే ఎన్నోరెట్లు అధికంగా స్పందన లభించగా, విపరీతమైన డిమాండ్‌తో సర్వర్లు డౌనైపోవడంతో 24 గంటలపాటు ఆర్డర్లను నిలిపివేసింది రింగింగ్ బెల్స్. తర్వాత మళ్లీ బుకింగ్స్‌ను స్వీకరించగా, తొలి దశలో భాగంగా చేపట్టిన ఈ బుకింగ్స్‌ను నిలిపివేస్తున్నట్లు శనివారం సంస్థ ప్రకటించింది. మొదటి రోజు 3.70 కోట్ల బుకింగ్స్‌ను, తర్వాతి రోజు మరో 2.47 కోట్ల ఆర్డర్లు నమోదైయ్యాయని తెలిపింది. ప్రారంభంలో సెకనుకు 6 లక్షల బుకింగ్స్ రిజిస్టరైనట్లు కూడా రింగింగ్ బెల్స్ ప్రకటించింది. అమితి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన మోహిత్ కుమార్ గోయెల్ రింగింగ్ బెల్స్ సంస్థను ఐదు నెలల క్రితం నెలకొల్పగా, ఇంతకుముందు ప్రపంచంలోనే అత్యంత చౌక 4జి స్మార్ట్ఫోన్‌ను కూడా 2,999 రూపాయలకే రింగింగ్ బెల్స్ విడుదల చేసింది.
అయతే ఫ్రీడమ్ 251 స్మార్ట్ఫోన్‌పై మాత్రం భారీ స్థాయిలో అనుమానాలు తలెత్తుతున్నాయ. ఈ స్మార్ట్ఫోన్ మరో సంస్థ స్మార్ట్ఫోన్‌ను కాపీ కొట్టి రీబ్రాండ్‌తో మార్కెట్‌లోకి వస్తోందా? అన్న కోణంలో అనుమానాలు వినిపిస్తున్నాయి. యాడ్‌కామ్ అనే సంస్థ రూపొందించిన ఐకాన్ 4ను పోలీ ఉందని, దానే్న ఇలా తిరిగి తయారు చేసేశారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఐకాన్ 4.. 3,999 రూపాయలకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలో యాడ్‌కామ్ వ్యవస్థాపక చైర్మన్ సంజీవ్ భాటియా మాట్లాడుతూ కొన్ని డివైజ్‌లను తమ నుంచి రింగింగ్ బెల్స్ తీసుకుందని, కానీ ఇంతకుమించి దీనిపై తాను ఏమీ మాట్లాడలేనన్నారు. మరోవైపు ఫ్రీడమ్ 251లో ఉన్న యాప్స్‌లో చాలావరకు యాపిల్ ఐఫోన్‌లో ఉన్నవే కనిపిస్తుండటం గమనార్హం. అయతే ఫోన్ ప్రారంభోత్సవంలో శాంపిల్ మోడల్స్‌ను చూపించామని, మార్కెట్‌లో విక్రయించేటప్పుడు అసలు బ్రాండ్ ఉంటుందని రింగింగ్ బెల్స్ ప్రతినిధి స్పష్టం చేశారు. మొత్తానికి రింగింగ్ బెల్స్ వ్యవహారం హాట్‌హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు.