బిజినెస్

మొండి బకాయిలపై ఆర్‌బిఐ, బ్యాంకర్ల తీరు బాగోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ వ్యవస్థకు ప్రమాదకరంగా మారిన మొండి బకాయిల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ), బ్యాంకుల తీరు నిరాశాజనకంగా ఉందంటూ పార్లమెంటరీ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. పెరుగుతున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ)తో వాటి నియంత్రణకు చేపడుతున్న చర్యల విశ్వసనీయతపై అనుమానాలు కలుగుతున్నాయంది. ముఖ్యంగా మొండి బకాయిలను అడ్డుకోవడానికి బ్యాంకింగ్ రంగ రెగ్యులేటర్‌గా ఆర్‌బిఐ తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ప్రభావవంతంగా ఉండటం లేదంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నవారు ఆ రుణాలను ఎగవేస్తే సదరు బ్యాంకులపై చర్యల విషయంలోనూ ఆర్‌బిఐ మెతక వైఖరిని అవలంభిస్తోందంటూ పెదవి విరిచింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు 4 లక్షల కోట్ల రూపాయలను తాకే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ బుధవారం పార్లమెంట్‌కు తెచ్చిన ఓ నివేదికలో చెప్పింది. సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్ వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో 31 మంది సభ్యులుండగా, వీరిలో మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. నిరర్థక ఆస్తులను వెంటనే నియంత్రించే చర్యలను పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం చాలా ఉందని కమిటీ అభిప్రాయపడింది. కాగా, గత ఏడాది మార్చి నాటికి 2.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల నిరర్థక ఆస్తులు.. సెప్టెంబర్ నాటికి 3.01 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ముఖ్యంగా ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లోని మొత్తం ఎస్‌బిఐసహా 24 ప్రభుత్వరంగ బ్యాంకుల మార్కెట్ విలువ 2,62,955 కోట్ల రూపాయలుగా ఉండగా, డిసెంబర్ 2015 నాటికి ఈ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ 3,93,035 కోట్ల రూపాయలుగా ఉండటం గమనార్హం. మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికికే మొండి బకాయిలు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో చాలావరకు ప్రభుత్వ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా నమోదైనది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకిం గ్ దిగ్గజం ఎస్‌బిఐసహా కొన్ని బ్యాంకుల నికర లాభాలు సగానికిపైగా ఆవిరైపోగా, మరికొన్ని బ్యాంకులు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. దీనంతటికీ కారణం నిరర్థక ఆస్తులే (మొండి బకాయిలు). ఈ త్రైమాసికం (జనవరి- మార్చి)లోనూ లాభాలపై మొండి బకాయిల ప్రభావం ఉంటుందని ఎస్‌బిఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదిలావుంటే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్.. తమ రుణగ్రహీతల్లో ఏకంగా సుమారు 900 సంస్థలని ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్ డిఫాల్టర్లు)గా మంగళవారం ప్రకటించినది తెలిసిందే. వీటి రుణాల విలువ సుమారు 11,000 కోట్ల రూపాయలు. ఇటీవల లిక్కర్‌కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని దేశీయ ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ కింగ్‌ఫిషర్‌ను కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించినది తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 1,500 కోట్ల రూపాయల మేర పం జాబ్ నేషనల్ బ్యాంక్‌కు బకాయి పడింది.

హైదరాబాద్‌లో ఉబర్
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ప్రారంభం

ఆవిష్కరించిన కెటిఆర్
2017 నాటికి 500 ఉద్యోగాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 24: హైదరాబాద్‌లో స్మార్ట్ఫోన్ యాప్ ఉబర్.. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించింది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం దీన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఐటి రంగంలో అన్ని రకాల టెక్నాలజీలకు ప్రధాన కేంద్రంగా రాణిస్తోందన్నారు. ఆసియాలోనే తొలిసారిగా వినూత్నమైన టెక్నాలజీతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఉబర్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. వచ్చే ఏడాది చివర్లోగా ఐదు వందల మంది ఐటి నిపుణులకు ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలన్న సంస్థ సంకల్పాన్ని కూడా ఆయన అభినందించారు. ఉబర్ ఇండియా సంస్థ అధ్యక్షులు అమిత్ జైన్ మాట్లాడుతూ నూతన సాంకేతికతతో ఈ ఎక్స్‌లెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో సహకారాన్ని అందించిందని, అందువల్లే దీన్ని త్వరగా నెలకొల్పగలిగామన్నారు. గత ఏడాది జూలైలో తెలంగాణ రాష్ట్రంలో 50 మిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలుగా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కాగా, రైడర్స్, డ్రైవర్ ఆపరేషన్స్‌కు సెంటర్ ద్వారా 500లకుపైగా కస్టమర్ సర్వీస్ స్పెషలిస్టులు నిర్విరామంగా 24/7 నాణ్యమైన సేవలు అందిస్తారన్నారు. ఇ-మెయిల్, ఫోన్, సోషల్ మీడియా ద్వారా సకాలంలో కస్టమర్లకు చేరువవుతామన్నారు.