బిజినెస్

ఆందోళన అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశీయ మార్కెట్లలో జరుగుతున్న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పెద్దగా ఉండబోదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-నవంబర్ వ్యవధిలో భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు దాదాపు 7,008 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. నిజానికి గత ఆర్థిక సంవత్సరం (2014-15)లో 2.77 లక్షల కోట్ల రూపాయలను, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2013-14)లో 51,649 కోట్ల రూపాయల పెట్టుబడులను దేశీయ మార్కెట్లలోకి ఎఫ్‌పిఐలు తెచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎఫ్‌పిఐలు తమ పెట్టుబడులను లాగేసుకుంటుండగా, దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన పెను ముప్పేమీ లేదని రాజ్యసభలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. ఆర్థిక కరెంట్ ఖాతా లోటుకు సరిపడా విదేశీ పెట్టుబడులున్నాయన్నారు.
రూ. 3,174 కోట్ల పెట్టుబడులు
ఉద్యోగ భవిష్య నిధి ఇపిఎఫ్‌ఒ.. దాదాపు గత నాలుగు నెలల్లో ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)లో 3,174 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టినట్లు జయంత్ సిన్హా తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ పెట్టుబడులు ప్రారంభమవగా, గత నెల నవంబర్ 30 నాటికి మొత్తం 3,174 కోట్ల రూపాయల పెట్టుబడులను ఇటిఎఫ్‌లలో ఇపిఎఫ్‌ఒ పెట్టిందని మంత్రి వివరించారు.