బిజినెస్

యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్‌గా తప్పుకున్న మాల్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. యునైటెడ్ స్పిరిట్స్ చైర్మన్ పదవికి గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు మాల్యా బ్రిటన్‌కు మకాం మార్చేయనున్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిలకు సంబంధించి బ్యాంకులు మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, యునైటెడ్ స్పిరిట్స్‌ను మాల్యా కుటుంబమే స్థాపించినప్పటికీ, ప్రస్తుతం ఆ సంస్థలో మెజారిటీ వాటా అంతర్జాతీయ లిక్కర్ సంస్థ డియాజియో చేతుల్లో ఉంది. మాల్యా ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితుల మధ్య ఆయన చైర్మన్‌గా ఉండటాన్ని డియాజియో వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో మాల్యా తప్పుకున్నారు. ఇదిలావుంటే మాల్యా కు డియాజియో సపరేషన్ ఫీజుగా రూ. 515 కోట్లను చెల్లించనుంది.