బిజినెస్

23 వేల దిగువకు సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లోనే ముగిశాయి. గత రెండు రోజులుగా అమ్మకాల ఒత్తిడిలో ఉన్న మదుపరులను రైల్వే బడ్జెట్ సైతం పెట్టుబడుల దిశగా నడిపించలేకపోయింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 112.93 పాయింట్లు పడిపోయి 23 వేలకు దిగువన 22,976 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 48.10 పాయింట్లు దిగజారి 7 వేల స్థాయిని కోల్పోతూ 6,970.60 వద్ద నిలిచింది. కాగా, ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారంతో ముగియనుండటం వల్ల మదుపరులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. విద్యుత్, నిర్మాణ, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆటో, ఐటి, టెక్నాలజీ, చమురు, గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్ల విలువలు 2.19 శాతం వరకు క్షీణించాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కె ట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా మార్కెట్లు ఆరంభంలో లాభాల్లో కదలాడాయి. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గురువారం ట్రేడింగ్‌లో 30 నెలల కనిష్టానికి పతనమైంది. 15 పైసలు కోల్పోయి 68.72 వద్ద స్థిరపడింది. బుధవారం ముగింపుతో చూస్తే ఉద యం ప్రారంభంలో లాభపడినప్ప టికీ చివరకు నష్టాలే మిగిలాయ.