బిజినెస్

మరో వివాదంలో రింగింగ్ బెల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఫ్రీడమ్ 251 పేరిట ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసిన రింగింగ్ బెల్స్.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే ఫ్రీడమ్ 251 తయారీ, విడుదల, పంపిణీపై పలు అనుమానాలను ఈ సంస్థ ఎదుర్కొంటున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రీడమ్ 251కు సంబంధించి కస్టమర్ సర్వీస్ సేవలను అందిస్తున్న బిపిఒ సంస్థ సైఫ్యూచర్ తమ బకాయిలను రింగింగ్ బెల్స్ చెల్లించడం లేదని ఆరోపించింది. ఈ మేరకు సైఫ్యూచర్ వ్యవస్థాపకుడు, సిఇఒ అనుజ్ బైరథి ఆరోపించారు. మరోవైపు కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న కాల్స్‌ను అందుకోవడంలో సైఫ్యూచర్ సంస్థ విఫలమైందని రింగింగ్ బెల్స్ అంటోంది. అయతే 251 విడుదలయ్యాక కొద్దిరోజులు లక్షలాది కాల్స్‌ను అందుకున్నామని, రింగింగ్ బెల్స్ కూడా తమ సేవలపట్ల సంతృప్తి వ్యక్తం చేసిందని, కాని డబ్బులు అడగడంతో తప్పించుకోవడం మొదలు పెట్టిందని బైరథి తెలిపారు.