బిజినెస్

పెట్టుబడుల ఉపసంహరణకే ఆసక్తి (వారాంతపు సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం నష్టాల్లో ముగిశాయి. ఆర్థిక సర్వే 2015-16 సందర్భంగా శుక్రవారం లాభాలను అందుకున్న సూచీలు.. అంతకుముందు మూడు రోజులు మాత్రం నష్టాలకే పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో భారత జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7-7.75 శాతంగా ఉంటుందని శుక్రవారం పార్లమెంట్‌కు వచ్చిన ఆర్థిక సర్వే అంచనా వేయడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఇందులోభాగంగానే కొనుగోళ్లకు ఆసక్తి కనబరిచారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 178, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 59 పాయింట్లు పెరిగాయి. అయితే అంతకుముందు మూడు రోజులు సూచీలు భారీగా నష్టపోయాయి. సోమవారం సెనె్సక్స్ 80, నిఫ్టీ 24 పాయింట్ల చొప్పున మోస్తరు లాభాలను అందుకోగా, మంగళవారం సెనె్సక్స్ 379, నిఫ్టీ 125 పాయింట్లు పడిపోయాయి. బుధవారం కూడా సెనె్సక్స్ 321, నిఫ్టీ 91 పాయింట్లు పతనమవగా, గురువారం సెనె్సక్స్ 113 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్ల చొప్పున దిగజారాయి. ఫలితంగా గడచిన వారం మొత్తంగా సెనె్సక్స్ 554.85 పాయింట్లు క్షీణించి 23,154.30 వద్ద ముగియగా, నిఫ్టీ 181 పడిపోయి 7,029.75 వద్ద స్థిరపడింది. ఇక విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) గడచిన వారం 1,749.26 కోట్ల రూపాయల విలువైన అమ్మేశారు. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వివరాలను తెలిపింది. అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా మార్కెట్ల నష్టాలు, ఫిబ్రవరి నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు, రైల్వే బడ్జెట్ నిరాశ కలిగించడం వంటివి మదుపరులను అమ్మకాల ఒత్తిడికి గురిచేశాయి. ఇక బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 2.35 శాతం, స్మాల్-క్యాప్ 3.25 శాతం చొప్పున నష్టపోయాయి. ఆయా రంగాలవారీగా విద్యుత్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఐటి, టెక్నాలజీ, హెల్త్‌కేర్, మెటల్, ఎఫ్‌ఎమ్‌సిజి, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 4.09 శాతం నుంచి 1.16 శాతం వరకు పతనమైయ్యాయి. టర్నోవర్ విషయానికొస్తే గడచిన వారం బిఎస్‌ఇ 10,956.21 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ 70,706.22 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 13,430.93 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 77,649.74 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. క్రిందటి వారం సెనె్సక్స్ 723 పాయింట్లు, నిఫ్టీ 230 పాయింట్లు లాభపడ్డాయి.