బిజినెస్

యువాన్ క్షీణతలో మా ప్రమేయం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై: దిగజారిన ఎగుమతులు, విదేశీ వాణిజ్య అవకాశాలను పెంపొందించుకోవడానికి వీలుగా కరెన్సీ విలువ తగ్గింపునకు పాల్పడుతోందన్న ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. శుక్రవారం రాత్రి ఇక్కడ ముగిసిన జి20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో చైనా పైవిధంగా స్పష్టం చేసింది. ఒక్కసారిగా యువాన్ విలువ తగ్గడంలో తమ ప్రమేయమేమీ లేదని పేర్కొంది.
ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనే సామర్థ్యం చైనాకు ఉందని, అందుకు తగిన రక్షణ విధానాలు తమ వద్ద చాలానే ఉన్నాయని చైనా ప్రధాన మంత్రి లీ కెక్వియాంగ్ ఓ వీడియో సందేశంలో జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లకు తెలియజేశారు. పడిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టడానికి, ఎగుమతుల వృద్ధికి చైనా తమ కరెన్సీ యువాన్ విలువను అంతర్జాతీయ కరెన్సీగా చలామణీలో ఉన్న అమెరికా డాలర్‌తో పోల్చితే కావాలనే తగ్గిస్తోందంటూ భారత్‌సహా ఇతర దేశాలు గట్టిగా విమర్శిస్తున్న నేపథ్యంలో కెక్వియాంగ్ ఇలా వివరణ ఇచ్చారు. కరెన్సీ విలువ తగ్గితే డాలర్లలో జరిగే విదేశీ వాణిజ్యంలో చైనా ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతాయనే ఉద్దేశపూర్వకంగా చైనా యువాన్ విలువను దిగజారుస్తోందని వివిధ దేశాలు ఆరోపిస్తున్నాయి. తద్వారా ఇతర దేశాల ఎగుమతులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత ఎగుమతులు గత ఏడాదికిపైగా కాలం నుంచి క్షీణిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దేశ కరెన్సీ విలువనే తగ్గించాల్సిన అవసరం లేదని, సమర్థవంతమైన విధానాలు తమ వద్ద ఉన్నాయని, వాటితో తిరిగి తాము ఎలా పుంజుకోవాలో తెలుసని కెక్వియాంగ్ చెప్పారు.
పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వే కారణంగా ఈ సమావేశాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గైర్హాజరవగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్, అదనపు ఆర్థిక కార్యదర్శి దినేశ్ శర్మ పాల్గొన్నారు. కాగా, దేశీయంగా, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్న విశ్వాసాన్ని కెక్వియాంగ్ వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం, స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకుల మధ్య ఈ రెండు రోజుల జి20 సమావేశం జరగగా, ఈ ఏడాది ప్రపంచ వృద్ధిరేటు 3.4 శాతంగానే ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) అంచనా వేసింది. గత ఏడాది చైనా జిడిపి వృద్ధిరేటు 7 శాతం దిగువకు పడిపోయి 6.9 శాతానికి పరిమితమవగా, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అంతా కలిసికట్టుగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని కెక్వియాంగ్ అభిప్రాయపడ్డారు. కేవలం దేశ వృద్ధిరేటు బలోపేతానికి కాకుండా, సమష్ఠిగా ప్రపంచ వృద్ధిరేటు పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇకపోతే గత ఏడాది ఒడిదుడుకులను ఎదుర్కొన్న చైనా జిడిపి, కరెన్సీలు.. ఈ ఏడాది ఆరంభం నుంచీ పడుతూలేస్తూనే పయనిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో చైనా రిజర్వ్ బ్యాంకైన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గవర్నర్ జో జియాచువాన్ మాట్లాడుతూ విదేశీ వాణిజ్యాన్ని పెంచుకోవడానికి తాము తమ కరెన్సీని ఎప్పుడూ తగ్గించబోమన్నారు. గత ఏడాది దాదాపు 4 శాతం చైనా కరెన్సీ విలువ పడిపోగా, దేశ ఎగుమతుల ఆదాయం క్షీణించిన క్రమంలో నష్టాల్లో నడిచిన స్టాక్ మార్కెట్ల వల్లే ఇదంతా అని జియాచువాన్ అన్నారు. ప్రస్తుతం డాలర్‌తో పోల్చితే యువాన్ విలువ 6.50 యువాన్లుగా ఉంది.