బిజినెస్

ఐటి పరిమితి పెంపు ఖాయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో కనీస ఆదాయ పన్ను (ఐటి) మినహాయింపు పరిమితిని 3 లక్షల రూపాయలకు పెంచుతుందని మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) విభాగం అంచనా వేస్తోంది. ఇదే గనుక జరిగితే ఆదాయ పన్ను చెల్లింపుదారులకు అదనంగా 50 వేల రూపాయల సొమ్మును మిగుల్చుకోగలిగి అందులో కొంత మొత్తాన్నయినా పెట్టుబడులు పెట్టేందుకు వీలుంటుందని ఎంఎఫ్ రంగం భావిస్తోంది. అలాగే క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఒనగూడే సొమ్మును కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మ్యూచువల్ ఫండ్ ప్రోడక్టుల్లో పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించాలని ఆ రంగం కోరుకుంటోంది. ‘ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో కనీస ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 3 లక్షల రూపాయలకు పెంచుతారని ఆశిస్తున్నాం. ఇదే గనుక జరిగితే మ్యూచువల్ ఫండ్స్‌లోకి మరిన్ని పెట్టుబడులు వచ్చి ప్రస్తుతం రూ.13.4 ట్రిలియన్లుగా ఉన్న ఎంఎఫ్ ఆస్తులు మరింత పెరుగుతాయి’ అని ఎల్‌ఐసి నొమురా మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇనె్వస్ట్‌మెంట్ ఆఫీసర్ శ్రావణ కుమార్ పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. ‘టారస్ మ్యూచువల్ ఫండ్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వకార్ నక్వీ కూడా ఇదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వం 2016-17 సార్వత్రిక బడ్జెట్‌లో కనీస ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచుతుందని నేను భావిస్తున్నా. దీని వలన పన్ను చెల్లింపుదారులు అదనంగా అదనంగా 50 రూపాయలు మిగుల్చుకుని అందులో కొంత మొత్తాన్నయినా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడతారు’ అని ఆయన తెలిపారు. అలాగే క్యాపిటల్ గెయిన్స్ ద్వారా ఒనగూడే సొమ్మును ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించాలని కూడా ఆయన కోరారు.