బిజినెస్

నిరుద్యోగ చందాదారులకు మొత్తం పిఎఫ్ ఇచ్చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉద్యోగ భవిష్య నిధి నుంచి నిరుద్యోగ చందాదారులు తమ మొత్తం ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతించాలని, లేదంటే వారి ఖాతాల్లో ఉంచిన సొమ్ముకు వడ్డీ అయినా చెల్లించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు చెందిన భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) సహా పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ‘నిరుద్యోగ చందాదారులు తమ పూర్తి ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) అనుమతించాలి. లేదంటే వారి ఖాతాల్లో అట్టిపెట్టిన సొమ్ముకు వడ్డీ అయినా చెల్లించాలి. ఈ విషయమై మేము కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయకు విజ్ఞప్తి చేస్తాం’ అని కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న ఐఎన్‌టియుసి (ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) ఉపాధ్యక్షుడు, ఇపిఎఫ్‌ఓ ట్రస్టీ అశోక్ సింగ్ పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. ఇపిఎఫ్ చందాదారులు తమ ఖాతాల్లోని ప్రావిడెంట్ ఫండ్ సొమ్మును ఉపసంహరించుకునేందుకు ఉద్దేశించిన నిబంధనలను ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఇటీవల కఠినతరం చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఇపిఎఫ్ చందాదారులు పిఎఫ్ ఖాతాల్లోని తమ సొంత సొమ్ములో 90 శాతం మొత్తాన్ని, అలాగే ఆ సొమ్ముపై వడ్డీని విత్‌డ్రా చేసుకునేందుకు మాత్రమే వీలవుతోంది. అది కూడా వారు నిరుద్యోగులుగా మారిన రెండు నెలల తర్వాతే ఈ సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ఇపిఎఫ్‌ఓ అనుమతిస్తోంది. అయితే గతంలో ఇపిఎఫ్ చందాదారులు నిరుద్యోగులుగా మారిన రెండు నెలల తర్వాత పిఎఫ్‌లోని మొత్తం సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుండేది.

తొలి మూడు త్రైమాసికాల్లో
ఎఫ్‌డిఐ 40 శాతం వృద్ధి

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి మూడు త్రైమాసికాల్లో (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 40 శాతం వృద్ధి చెంది 29.44 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో మన దేశంలోకి 21.04 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16)లోని తొలి మూడు త్రైమాసికాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అధికంగా ఆకర్షించిన రంగాల్లో కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగం 5.3 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలువగా, సేవల రంగం (4.25 బిలియన్ డాలర్లు), వ్యాపార రంగం (2.71 బిలియన్ డాలర్లు), ఆటోమొబైల్ రంగం (1.78 బిలియన్ డాలర్లు), రసాయనాల రంగం (1.19 బిలియన్ డాలర్లు) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయని డిఐపిపి (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్) తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేశాయి.
ఇదిలావుంటే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో భారత్‌కు సింగపూర్ నుంచి అత్యధిక పెట్టుబడులు రావడంతో ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న మారిషస్ రెండో స్థానానికి పడిపోయింది. ఏపిల్-డిసెంబర్ మధ్య కాలంలో సింగపూర్ నుంచి భారత్‌కు అత్యధికంగా 10.98 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా, మారిషస్ నుంచి 6.1 బిలియన్ డాలర్లు, అమెరికా నుంచి 3.51 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ నుంచి 2.14 బిలియన్ డాలర్లు, జపాన్ నుంచి 1.08 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని డిఐపిపి వెల్లడించింది. కాగా, 2014 క్యాలెండర్ సంవత్సరంలో భారత్‌కు మొత్తం 28.78 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు రాగా, 2015లో అవి 37 శాతం వృద్ధి చెంది 39.32 బిలియన్ డాలర్లకు పెరిగాయని డిఐపిపి తెలిపింది.