బిజినెస్

రుణ ఎగవేతదారుల జాబితా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూరు: దేశంలో రూ.100 కోట్లు, అంతకంటే ఎక్కువ మొత్తం రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన ఎగవేతదారుల జాబితాను ప్రచురించాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్ నుంచి బ్యాంకు ఉద్యోగులు ఏమి ఆశిస్తున్నారని ఆదివారం కోయంబత్తూరులో విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్.వెంకటాచలం సమాధానమిస్తూ, సంస్కరణలను అమలుచేసి సేవలను మెరుగుపర్చాలని బ్యాంకింగ్ రంగం ఎదురు చూస్తోందన్నారు. రైతులకు ప్రభుత్వం తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందజేయాలని, తద్వారా స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) గణనీయంగా వృద్ధి చెందేందుకు వ్యవసాయ రంగం మరోసారి ఇతోధికంగా తోడ్పడగలుగుతుందని ఆయన సూచించారు. 90 లక్షల కోట్ల రూపాయల చిన్నమొత్తాల పొదుపు నిధులతో వ్యాపారం సాగిస్తున్న బ్యాంకులు ఎటువంటి శాఖలు లేని గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల శాఖలను తెరవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలను రద్దు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, కనుక రుణ ఎగవేతదారుల జాబితాను వెల్లడించి వారిపై క్రిమినల్ కేసులు దాఖలు చేయడంతో పాటు కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అనేక బ్యాంకులకు కోట్లాది రూపాయల అప్పులు ఎగ్గొట్టిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా దేశం నుంచి జారుకోవాలని యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ వెంకటాచలం ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

‘వేదాంత’కు
బంగారు గని
దేశంలో తొలిసారి వేలం
రాయ్‌పూర్, ఫిబ్రవరి 28: దేశంలో తొలిసారి ఒక బంగారు గనిని వేలం వేశారు. చత్తీస్‌గఢ్‌లోని బాగ్‌మారా (సోనాఖాన్) గని లైసెన్సు కోసం ఆదివారం నిర్వహించిన ఈ వేలంలో ప్రముఖ సంస్థ ‘వేదాంత’ విజేతగా నిలిచింది. ఈ గని కోసం ఇండియన్ బ్యూరో ఆఫ్ మైనింగ్ (ఐబిఎం) ట్రాయ్ ఔన్సు (31.10 గ్రాముల)కు 74,712 రూపాయల చొప్పున బిడ్ దాఖలు చేయగా అంతకంటే 12.55 శాతం ఎక్కువ మొత్తానికి వేదాంత బిడ్ దాఖలుచేసి దీనిని కైవసం చేసుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. దేశంలో పుత్తడి నిక్షేపాల తవ్వకానికి కాంపోజిట్ లైసెన్సు ఇవ్వడం ఇదే తొలిసారి అని, ఈ గని నుంచి ఉత్పత్తి ప్రారంభమైతే దేశంలోకి బంగారం దిగుమతులు తగ్గుతాయని చత్తీస్‌గఢ్ గనుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్‌లోని బలోడాబజార్-్భత్‌పరా జిల్లాలో గల ఈ గని రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు ఈశాన్య దిశలో 130 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ ఆధ్వర్యాన
స్మాష్ అప్ 2016 నిర్వహణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 28: సాంకేతిక, సాంకేతికేతర రంగాల్లో చిన్న చిన్న పరిశ్రమలు స్ధాపించే వారికి అప్పటికప్పుడు నిధులు సమకూర్చేందుకు ఉద్దేశించిన ‘స్మాష్ అప్ 2016’ను ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (టిఐఇ) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించింది. నగరంలోని ఒక హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దీనిలో యూనిటస్ సీడ్ ఫండ్, 50కె వెంచర్స్, అంథిల్ వెంచర్స్, సాహా ఫండ్, ఇండియన్ ఏంజెల్ నెట్‌వర్క్, హైదరాబాద్ ఏంజెల్స్, పరంపర ఫండ్ వంటి పెట్టుబడిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఐఇ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు సురేష్ చల్లా మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన ‘స్టార్ట్‌ప్ ఇండియా మూమెంట్’ను ఆచరణలో అమలు చేసేందుకు చిన్న స్టార్ట్‌ప్‌లను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 11 కంపెనీలకు గాను గ్రీన్‌పిరమిడ్ బయోటెక్, న్యూస్‌డాష్, థెరానోసిస్ లైఫ్ సైన్స్‌స్ ప్రైవేట్ లిమిటెడ్, కుపిడ్ కేర్‌లు ఫండ్‌ను ఫండ్‌ను పొందాయని తెలిపారు.

స్మార్ట్ విలేజ్‌లకు తగ్గుతున్న స్పందన

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, ఫిబ్రవరి 28:గ్రామాలను వివిధ సంస్థలు, వ్యక్తులు దత్తత తీసుకుని, తద్వారా అభివృద్ధికి ఉద్దేశించిన స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డు పథకంపై ఆసక్తి తగ్గుతోంది. పథకం ప్రారంభించిన తొలినాళ్లలో ఎక్కువ మంది ఆసక్తి చూపించినా, తరువాత ఇది తగ్గడం గమనార్హం. రాష్ట్రంలో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యంలో దాదాపు 60 శాతం మేరకు మాత్రమే భాగస్వాములయ్యారు. ఇంకా దాదాపు 41 శాతం మేరకు భాగస్వాములు కావాల్సి ఉంది. రాష్ట్రంలో మూడు జిల్లాల్లో స్పందన బాగున్నప్పటికీ, మిగిలిన జిల్లాల్లో మాత్రం స్పందన తగినంతగా లేదు. గ్రామాల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు వివిధ సంస్థలను, వ్యక్తులను భాగస్వాములను చేసి, తద్వారా గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించేందుకు ఈ పథకాన్ని గత ఏడాది ప్రారంభించారు. 20 అంశాల్లో ప్రగతి ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చేందుకు నిర్ణయించారు. ముందుగా మంచినీరు, పారిశుద్ధ్యం, జల వనరులు, వ్యర్థాల నిర్వహణ వంటి ఐదు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పథకం ప్రారంభంలో దీనికి స్పందన బాగానే లభించింది. అనేక మంది గ్రామాల్లోని వివిధ అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చి దత్తత తీసుకున్నారు. అయితే తరువాతి కాలంలో దీనిపై అధికార యంత్రాంగం అంతగా ఆసక్తి కనబరచకపోవడంతో గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యంలో తగిన వృద్ధి కనిపించడం లేదు. ఆదివారం నాటికి రాష్ట్రంలో వివిధ గ్రామాల అభివృద్ధికి భాగస్వామ్యం 61 శాతం పూర్తి అయింది. రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వామ్యానికి 13 జిల్లాలో 16377 పంచాయతీ/ వార్డులను ఎంపిక చేశారు. అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు 16517 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 14982 దరఖాస్తులను ఖరారు చేసి భాగస్తులయ్యేందుకు అనుమతించారు. ఇంకా 6718 గ్రామాలకు సంబంధించి భాగస్వాములను చేయాల్సి ఉంది. అధికారులు ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు సంబంధించి మొదటి స్థానంలో విశాఖ, తరువాతి స్థానాల్లో ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో 16 గ్రామాలు, ప్రకాశం జిల్లాలో 75, గుంటూరులో 281, విజయనగరంలో 38 పంచాయతీల అభివృద్ధిలో భాగస్వాములను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. మిగిలిన జిల్లాలో చాలా పంచాయతీలు/ వార్డుల అభివృద్ధికి భాగస్వాములను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. శ్రీకాకుళంలో 76 పంచాయతీలు (వార్డులు), తూర్పు గోదావరిలో 569, పశ్చిమ గోదావరిలవో 509, కృష్టా జిల్లాలో 818, నెల్లూరులో 620, చిత్తూరులో 1149, కడపలో 499, అనంతపురంలో 369, కర్నూలులో 721 గ్రామాలు లేదా వార్డుల అభివృద్ధికి భాగస్వాములు ఇంకా రావాల్సి ఉంది.

పథకం ప్రారంభంలో ఉన్న ప్రచారం అధికార యంత్రాంగంలో కొరవడటమే ఇందుకు కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పథకం ప్రారంభించి సంవత్సరం పూర్తి అయినా, ఇంకా 40 శాతం ప్రాంతాల్లో ఇంకా భాగస్వాములను ఖరారు చేయాల్సి ఉంది. దీనికి తోడు గ్రామాలకు సంబంధించి స్మార్ట్ విలేజ్ ప్రత్యేకాధికారులుగా మండల స్థాయి అధికారులను నియమించారు. చాలా పంచాయతీల్లో ఈ అధికారుల వివరాలు తెలియని స్థితి నెలకొంది. స్మార్ట్ విలేజ్‌పై ఏర్పాటైన సమావేశాల్లో చేపట్టాల్సిన పనులు, తీసుకున్న చర్యల గురించి వివరించలేని పరిస్థితి గ్రామస్తుల విమర్శలకు గురవుతోంది.

‘సాగరమాల’కు రూ.10 లక్షల కోట్లు : గడ్కరీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘సాగరమాల’ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సమీకరించాలని యోచిస్తోంది. వీటిలో కేవలం వౌలిక వసతుల రంగం కోసమే రూ.4 లక్షల నిధులను సమీకరించాలని కేంద్రం భావిస్తోంది. విస్తారమైన 7,500 కిలోమీటర్ల తీరరేఖను ఉపయోగించుకుని దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ ప్రాజెక్టులో వౌలిక వసతుల రంగానికి 4 లక్షల కోట్ల రూపాయలు, పారిశ్రామిక పెట్టుబడులకు మరో 6 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని కేంద్ర రవాణా, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మారిటైమ్ లాజిస్టిక్స్ కీలకపాత్ర పోషిస్తూ ఎగుమతులు, దిగుమతులు పరిమాణ పరంగా 90 శాతం, విలువ పరంగా 72 శాతం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.