బిజినెస్

గ్రామానికి ఆర్థిక, ఆరోగ్య బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆదాయ పన్ను సంస్కరణలు, ఆరోగ్య బీమాను ప్రవేశపెట్టడం, గ్రామీణ ఆర్థిక రంగానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడాన్ని పారిశ్రామికవేత్తలు స్వాగతించారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు కేటాయంపులపట్ల ఆర్థిక నిపుణులు, ఆయా రంగాలవారు ఆనందం వ్యక్తం చేశారు. అయతే మరికొందరు మాత్రం పలు రంగాలకు జరిగిన అన్యాయంపట్ల తమ అసంతృప్తినీ వెలిబుచ్చారు.
‘గ్రామాల్లో వౌలిక సదుపాయల కల్పనపై కేంద్రం దృష్టి సారించడం ఆహ్వానించదగినది. కార్పొరేట్ పన్నుపై బడ్జెట్ నిర్ణయం అసంతృప్తి పరిచింది.’
- సిఐఐ అధ్యక్షుడు సుమిత్ మజుందార్
‘గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేయడాన్ని స్వాగతిస్తున్నాం. అయితే కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపుపై స్పష్టత కావాలి. భవిష్యత్ ప్రణాళికను విశదీకరించాలి. పన్ను మినహాయింపులు ఎలా ఉంటాయనేదానిపై వివరణ ఆశిస్తున్నాం.’
- ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా
‘గ్రామీణ ఆర్థిక రంగానికి పెద్దపీట వేశారు. వౌలిక రంగాల అభివృద్ధికి 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం స్వాగతిస్తున్నాం.’
- అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా
‘బడ్జెట్ సమతుల్యతతో ఉంది. అన్ని రంగాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక రంగానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించారు. అయతే పన్నుల సంస్కరణలను అధ్యయనం చేయాల్సి ఉంది.’
- సిఐఐ సదరన్ రీజియన్ వైస్ చైర్మన్ రమేష్ దాట్ల
‘రైతు, వ్యవసాయ సంక్షేమ బడ్జెట్ ఇది. వచ్చే ఏడాది మార్చి నాటికి రైతులందరినీ సాయిల్ హెల్త్ కార్డు స్కీం పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యాన్ని స్వాగతిస్తున్నాం. ఐదు లక్షల ఎకరాలను సేంద్రియ ఎరువుల పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరుతుంది. ఈ బడ్జెట్ గ్రామీణ ఆర్థిక రంగానికి మంచి ప్రోత్సాహం ఇస్తుం ది. ఆరోగ్య పరిరక్షణ రంగం విస్తరణకూ మంచి అవకాశాలు కల్పించారు.’
- ఫిక్కీ హెల్త్ సర్వీసెస్ కమిటీ చైర్‌పర్సన్ సంగీతరెడ్డి
‘కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ రంగానికి బృహత్తరమైన నిధులు కేటాయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పెద్ద పట వేశారు. వౌలిక సదుపాయాలపై ఎక్కువ శ్రద్ధ కనబరిచారు. అయతే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఆశించిన స్థాయలో ప్రొత్సాహకాలు, నిధులు లేవు.’
- ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి
‘్భరీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు, పరిశ్రమల స్థాపనకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. మొదటిసారిగా వ్యవసాయరంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. బీమా రంగంలో ప్రీమియంలపై 0.5 శాతం సెస్‌ను విధించడం వల్ల బీమా పాలసీలు ఖరీదుగా మారుతాయ.’
- మాక్స్ లైఫ్ బీమా ఎండి రాజేష్ సుదా
‘ఇది మంచి బడ్జెట్. జిడిపిలో ఆర్థిక లోటు 3.5 శాతం ఉండేటట్లుగా చూసుకోవడం మంచి పరిణామం.గ్రామీణ ఆర్థిక రంగం, వౌలిక సదుపాయాలకు భారీ నిధులు కేటాయించడం స్వాగతించదగినది.’
- భారత్ ఫోర్జ్ లిమిటెడ్ చైర్మన్ బాబా కల్యాణి
‘ఆదాయ పన్ను సంస్కరణలు బాగున్నాయ. సామాన్యులకు, మధ్యతరగతి వర్గాలకు ఆనందం కలిగించేలా ఆదాయ పన్నుల విధానంలో చేసిన మార్పులు శ్లాఘనీయం. మధ్య తరగతి వర్గానికి ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు.’
- బజాజ్ క్యాపిటల్ గ్రూప్ సిఇఒ అనిల్ చోప్రా
‘స్టార్టప్స్‌కు మొదటి మూడు సంవత్సరాలు పన్ను మినహాయింపు వంద శాతం ఇవ్వడం హర్షించదగినది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్టార్టప్స్‌కు పన్ను మినహాయింపు ఇవ్వడం భారీ ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లయింది.’
- ఆవ్‌ఫిస్ స్పేస్ సొల్యూషన్స్ సిఇఒ అమిత్ రమణి
‘దేశ వ్యాప్తంగా మూడు వేల జెనరిక్ మెడికల్ స్టోర్స్‌ను కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేశారు. ఒక లక్ష రూపాయల వరకు ఆరోగ్య బీమా పాలసీ ఇవ్వాలన్న నిర్ణయం విప్లవాత్మకమైనది. నేషనల్ డయాలసిస్ సర్వీసు సెంటర్ల ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూత్ర పిండాల వ్యాధి గ్రస్తులకు ఎనలేని ఆరోగ్య సేవలు అందించినట్లవుతుంది.’
- అస్టర్ హెల్త్‌కర్ ఎండి డాక్టర్ ఆజాద్ మోపెన్
‘ఐటి పరిశ్రమ, స్టార్టప్స్‌కు, విద్య రంగానికి పెద్దపీట వేశారు. స్టార్టప్స్‌కు ఊతాన్ని ఇచ్చారు. కానీ పలు రంగాలకు, అంశాలపై రాయితీలపట్ల మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉంది.’
- పెగాసిస్టమ్స్ ఎండి సుమన్ రెడ్డి
‘తొమ్మిది అంశాలను పునాదిగా తీసుకుని ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉంది. వైద్య రంగానికి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. మూత్ర పిండ వ్యాధి గ్రస్తులకు ఉపశమనం కలిగించే విధంగా జాతీయ డయాలసిస్ పథకాన్ని తీసుకురావడం మంచిది. నాణ్యమైన జెనరిక్ మెడిసెన్స్ షాపులను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నాం.’
- అపోలో హాస్పిటల్స్ డివిజన్ అధ్యక్షుడు హరి ప్రసాద్