బిజినెస్

గ్లోబల్ టాప్ ఎంప్లాయర్‌గా టిసిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: గ్లోబల్ టాప్ ఎంప్లాయర్‌గా దేశీయ ఐటిరంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)కు గుర్తింపు లభించింది. టాప్ ఎంప్లాయర్స్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో టిసిఎస్‌కు ఈ గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 1,072 సంస్థల్లో నిర్వహించిన సర్వేలో టిసిఎస్ అగ్రస్థానాన్ని అందుకుంది. నైపుణ్య వ్యూహం, సిబ్బంది ప్రణాళిక, ఆన్ బోర్డింగ్, లెర్నింగ్, అభివృద్ధి, మేనేజ్‌మెంట్ పనితీరు, నాయకత్వ లక్షణాలు, తదితర 9 కీలక అంశాల్లో టిసిఎస్.. మిగతా సంస్థల కంటే ముందుంది. ఇకపోతే తాజా జాబితాలో సిజెఎస్‌సి టెక్నిప్, డిహెచ్‌ఎల్, డైమెన్షన్ డేటా, సెయింట్ గోబెన్, జెటి ఇంటర్నేషనల్, మొబినిల్, మొబిస్టార్, ఆరెంజ్, వాలెయో సంస్థలకూ చోటు దక్కింది.