బిజినెస్

మార్కెట్‌ను మెప్పించని బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2016-17 మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. మదుపరుల నిరుత్సాహంతో సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ క్రమంలోనే భారీ నష్టాల్లో కూరుకుపోగా, చివర్లో కాస్త నష్టాల తీవ్రతను తగ్గించుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఒకానొక దశలో 660 పాయింట్ల మేర పతనమవగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల వరకు క్షీణించింది. అయితే మదుపరులు అమ్మకాల ఒత్తిడి నుంచి బయటకు రావడంతో ముగింపు సమయానికి సెనె్సక్స్ 152.30 పాయింట్లు దిగజారి 23,002 వద్ద ముగియగా, నిఫ్టీ 42.70 పాయింట్లు పడిపోయి 6,987.05 వద్ద నిలిచింది. జైట్లీ పన్ను ప్రతిపాదనలు మదుపరుల పెట్టుబడుల ఆసక్తిని దెబ్బతీశాయి.
సిగరెట్లపై పన్నుతో ఐటిసి తదితర సంస్థల షేర్లు 8 శాతం వరకు నష్టపోగా, ఇన్‌ఫ్రా, ఐటి, టెక్నాలజీ రంగాల షేర్ల విలువ కూడా 2.12 శాతం నుంచి 2 శాతం వరకు పతనమయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ మాత్రం 1.99 శాతం నుంచి 1.50 శాతం పెరిగింది. మరోవైపు అంతర్జాతీయంగా ఆసియా, ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడాయి.