బిజినెస్

సుస్థిరతకు నిలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్న నేపథ్యంలో సుస్థిరతకు స్థానంగా భారత ఆర్థిక వ్యవస్థ నిలుస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితులు సవాళ్లను విసురుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. మార్కెట్లు ఆందోళనకరంగా ఉన్నాయి. కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మేము వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను తాజా వార్షిక సాధారణ బడ్జెట్ తెచ్చాం.’ అని మంగళవారం ఇక్కడ జరిగిన సివిల్ అకౌంట్స్ డే 2016లో ఆయన అన్నారు. భారత స్థూల ఆర్థిక పరిస్థితులు నిలకడగానే ఉన్నాయని, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ వ్యయం కట్టడికి కట్టుబడి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. పడిపోతున్న ఎగుమతులు, వర్షాభావ పరిస్థితుల మధ్య కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో దేశ వృద్ధిరేటు నమోదవుతోందని గుర్తుచేశారు.
రూ. 1.14 లక్షల కోట్లు మాఫీ
ప్రభుత్వరంగ బ్యాంకులు గడచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో 1.14 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశాయని జైట్లీ మంగళవారం రాజ్యసభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. అంతకుముందు తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో మాఫీ చేసినదానికంటే ఇది అధికమని ఆయన పేర్కొనడం గమనార్హం.
ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికికే మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) ప్రమాదకరంగా మారుతున్నది తెలిసిందే. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఎస్‌బిఐసహా పలు బ్యాంకుల లాభాలకు మొండి బకాయిలు గండికొట్టగా, మరికొన్ని బ్యాంకులను తీవ్ర నష్టాల్లోకి నెట్టినది తెలిసిందే.
వృద్ధికి, ఉపాధికి సోపానాలు: అధియా
తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించిన పన్ను సంస్కరణలు వృద్ధి, ఉపాధి లక్ష్యంగా చేసినవని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మంగళవారం పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వెల్లువెత్తుతున్న ఉత్పత్తులకు చెక్ పెట్టేలా బడ్జెట్ ఉందన్న ఆయన దేశీయ ఉత్పాదక సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకున్నారన్నారు. ఫలితంగా ఉద్యోగ సృష్టి, వృద్ధిరేటుకు జైట్లీ దోహదం చేశారని అధియా అభిప్రాయపడ్డారు.

chitram...

సివిల్ అకౌంట్స్ డే 2016లో జైట్లీ