బిజినెస్

ప్రపంచంలో మూడో అత్యుత్తమ ఎయిర్ పోర్టుగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో అరుదైన ఘనతను సాధించింది. 2015 సంవత్సరానికి ఏసిఐ ప్రకటించిన ఏఎస్‌క్యు సర్వే సంస్థ ర్యాంకుల్లో ప్రపంచంలోని 5 నుంచి 15 మిలియన్ల సామర్థ్యం కలిగిన ఎయిర్ పోర్టుల్లో జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం 3వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జిఎంఆర్ ఎయిర్‌పోర్టు సిఇవో ఎస్‌జికె కిషోర్ మంగళవారం మాట్లాడుతూ ఏసిఐ నిర్వహించిన ఏఎస్‌క్యు సర్వే ర్యాంకుల్లో 5 నుంచి 15 మిలియన్ల ప్రయాణికుల కేటగిరీలో ప్రపంచ ఎయిర్‌పోర్టుల్లో తొలి 3 స్థానాల్లో ఒకటిగా నిలిచినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్‌కు కూడా దోహదపడుతుందన్నారు.
ఎపిటిడిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 1: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఎపిటిడిసి) కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బోర్డుకు పర్యాటక, యువజనాభ్యున్నతి, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి/కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బోర్డు చైర్మన్‌ను ప్రభుత్వం నియమించే వరకు ఈ విధానం కొనసాగుతుంది.

కార్ల ధరలను పెంచిన టాటా మోటార్స్

న్యూఢిల్లీ, మార్చి 1: దేశీయ ప్రముఖ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్.. మంగళవారం ప్యాసింజర్ వాహనాల ధరలను 35,000 రూపాయల వరకు పెంచింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ప్రకటించిన వార్షిక సాధారణ బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ ప్రభావమే ఈ ధరల పెంపునకు కారణం. ‘బడ్జెట్‌లో ప్రకటించిన సెస్ లెవీల దృష్ట్యా మా ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నాం. ధరల పెంపు వెంటనే వర్తిస్తుంది.’ అని టాటా మోటార్స్ ప్రతినిధి ఒకరు పిటిఐకి తెలిపారు. ఆయా మోడళ్ల ఆధారంగా కనిష్టంగా 2,000 రూపాయల నుంచి గరిష్ఠంగా 35,000 రూపాయల వరకు పెంపు ఉంటుందన్నారు. కాగా, ప్యాసింజర్ వాహనాలకు సంబంధించి నానో నుంచి ఆరైయా వరకు పలు రకాల మోడళ్లను మార్కెట్‌లో ప్రస్తుతం టాటా మోటార్స్ విక్రయిస్తోంది. వీటి ధరల శ్రేణి 2.04 లక్షల రూపాయల నుంచి 15.79 లక్షల రూపాయల వరకు (్ఢల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం) ఉంది.