బిజినెస్

సెనెసక్స్‌@777

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం లాభాల పంట పండింది. మదుపరుల కొనుగోళ్ల ఉత్సాహంతో సూచీలు పరుగులు పెట్టాయి. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను వార్షిక సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో దాదాపు ఏడేళ్లలో ఎప్పుడూ లేనంతగా సూచీలు ఈ ఒక్కరోజే రికార్డుస్థాయి లాభాలను అందుకున్నాయి. జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం ఆర్థిక దూరదృష్టితో వ్యవహరిస్తుందని, ఏప్రిల్ 1తో ఆరంభమయ్యే 2016-17 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3.5 శాతానికే కట్టడి చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ నెలలోనే కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మార్కెట్ వ్యాప్తంగా విస్తరించాయి. దీనికితోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో కదలాడటం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడటం వంటివి మదుపరులను పెద్దఎత్తున పెట్టుబడుల వైపునకు నడిపించాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఏకంగా 777.35 పాయింట్లు పుంజుకుని 23,779.35 వద్ద ముగియగా, 2009 మే 18 తర్వాత ఒక్కరోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం. నాడు 2,110.79 పాయింట్లు ఎగబాకింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 235.25 పాయింట్లు వృద్ధి చెంది 7,222.30 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ప్రారంభంలోనే సూచీలు భారీ లాభాలను అందుకున్నాయి. సమయం గడుస్తున్నకొద్దీ ఈ లాభాలు మరింతగా పెరిగాయి. కాగా, సోమవారం సూచీలు నష్టపోయినది తెలిసిందే. పన్నుల భారం మధ్య సెనె్సక్స్ 152 పాయింట్లు దిగజారితే, నిఫ్టీ 43 పాయింట్లు పడిపోయింది. ఇకపోతే ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, ఆటో రంగాల షేర్ల విలువ అత్యధికంగా 4.90 శాతం నుంచి 4.19 శాతం పెరిగింది.
మూడో అతిపెద్ద సంస్థగా ఐటిసి
మంగళవారం నమోదైన భారీ లాభాల మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో మార్కెట్ విలువ ప్రకారం ఐటిసి మూడో అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లను వెనక్కినెట్టి ఐటిసి ఈ స్థానంలోకి రాగా, ఈ ఒక్కరోజే సంస్థ షేర్ విలువ 9.91 శాతం పెరిగింది. సోమవారం నాటి బడ్జెట్ 2016-17లో సిగరెట్లపై పన్నుల మోతతో ఐటిసి షేర్ విలువ పడిపోయింది. అయితే మరుసటిరోజే మళ్లీ భారీగా పుంజుకోవడం గమనార్హం. ఇకపోతే ప్రస్తుతం ఐటిసి మార్కెట్ విలువ 2,61,403.46 కోట్ల రూపాయలుగా ఉంది. అగ్రస్థానంలో మాత్రం 4,48,272.36 కోట్ల రూపాయలతో టిసిఎస్ ఉండగా, రెండో స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 3,18,213.86 కోట్ల రూపాయలతో ఉంది. నాలుగో స్థానంలో ఇన్ఫోసిస్, ఐదో స్థానంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉన్నాయి.
ఆసియా, ఐరోపా మార్కెట్లలో ర్యాలీ
లండన్: ఆసియా, ఐరోపా మార్కెట్లు సైతం మంగళవారం లాభాల పరుగులు పెట్టాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చిన తాజా ఉద్దీపనల ప్రకటన ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను ఉత్సాహపరిచింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రస్తుతం చైనా కొనసాగుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని ఎదుర్కొనేందుకు చైనా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యవిధానాన్ని సరళతరం చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా భారత్‌తోసహా అన్ని ప్రధాన ఆసియా స్టాక్ మార్కెట్లు, ఐరోపాలోని ఫ్రాన్స్, జర్మనీ, బ్రటన్ సూచీలు లాభాల్లో కదలాడాయి.

3 వారాల గరిష్ఠానికి రూపాయి

ముంబయ: డాలర్‌తో పోల్చితే రూపాయి మార కం విలువ మంగళవారం 57 పైసలు పెరిగింది. దాదాపు 3 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ 67.85 వద్ద స్థిరపడింది. గతకొంత కాలంగా రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల బ్యాంకులు, ఎగుమతిదారుల నుంచి డాలర్ల అమ్మకాలు జరుగుతుండటంతో కాస్త కుదుటపడుతుండగా.. మంగళవారం ఒక్కరోజే 57 పైసలు ఎగబాకింది. అంతకుముందు మూడు రోజు ల్లో కలిపి 87 పైసలు కోలుకుంది. ఈ పరిణామం భారతీయ స్టాక్ మార్కెట్లకూ కలిసొచ్చింది.

రూ. 2.5 లక్షల కోట్లు
పెరిగిన మదుపరుల సంపద
ముంబయ: దేశీయ స్టాక్ మార్కెట్లు సుమారు ఏడేళ్ల గరిష్ఠ స్థాయి లాభాలను అందుకున్న క్రమంలో మదుపరుల సంపద ఒక్కసారిగా గణనీయంగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 777 పాయింట్లు పుంజుకోవడంతో అందులోని సంస్థల మార్కెట్ విలువ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎగిసింది. ఒక్కరోజులో ఈ స్థాయిలో సెనె్సక్స్ లాభాలను అందుకోవడం 2009 మే 18 తర్వాత ఇదే. ఇటీవల తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న బిఎస్‌ఇ విలువ 100 లక్షల కోట్ల రూపాయల స్థాయిని కోల్పోయింది. అయితే బడ్జెట్ నేపథ్యంలో ఆర్‌బిఐ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాలున్నాయన్న సంకేతాల మధ్య, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల లాభాల మధ్య మంగళవారం ఒక్కరోజే 2,51,743 కోట్ల రూపాయలు ఎగిసి 88,34,888 కోట్ల రూపాయలకు బిఎస్‌ఇ మార్కెట్ విలువ చేరుకుంది.