బిజినెస్

కేసులను ఉపసంహరిస్తేనే పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ పవర్.. కృష్ణపట్నం యుఎమ్‌పిపి ప్రాజెక్టు నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని భావిస్తే తమపై కోర్టుల్లో దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకోవాలని రిలయన్స్ పవర్‌కు విద్యుత్ కొనుగోలు ఒప్పందదారులు చెప్పినట్లు ఆంధ్రపద్రేశ్ జెన్‌కో మేనేజింగ్ డైరెక్టర్ కె విజయానంద్ బుధవారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ ప్రాజెక్టును రిలయన్స్ పవర్ 2007లో దక్కించుకోగా, దీన్నుంచి తయారైన విద్యుత్ అమ్మకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 11 సంస్థలతో ఒప్పందాలు జరిగాయి. అయితే ఇండేనేషియా నుంచి బొగ్గు దిగుమతి భారం కావడం, ఇతర ప్రతికూల పరిస్థితుల మధ్య ఇందులో విద్యుదుత్పత్తిని రిలయన్స్ పవర్ చేయలేకపోయింది. ఈ క్రమంలో ప్రాజెక్టు నుంచి నిష్క్రమించాలనుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత ఏడాది డిసెంబర్‌లో రిలయన్స్ పవర్ సిఇఒ ఎన్ వేణుగోపాల రావు ఓ లేఖ రాశారు. జార్ఖండ్‌లోని తిలైయా యుఎమ్‌పిపి తరహా రాజీకి వద్దామని ఇందులో సూచించారు. ఐదేళ్ళుగా ప్రతిష్ఠంభనకు గురైన తిలైయా ప్రాజెక్టులో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కొన్ని సర్దుబాట్లతో రద్దు చేసుకునేందుకు ఒప్పందదారులు అంగీకరించారు. ఇదేవిధంగా ముందుకెళ్దామని చెప్పారు. అయితే దీనిపై ఎటూ తేలకపోవడంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో విద్యుత్ కొనుగోలు ఒప్పందదారులతో రిలయన్స్ పవర్ న్యాయ పోరాటానికి దిగింది. దీనిపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను కూడా రిలయన్స్ ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తిలైయా యుఎమ్‌పిపితో తమ వ్యవహారాన్ని పోల్చవద్దని కృష్ణపట్నం యుఎమ్‌పిపి విద్యుత్ కొనుగోలు ఒప్పందదారులు అంటున్నారని, అయితే కోర్టులో తమపై వేసిన అన్ని కేసులను వెనక్కి తీసుకుంటే, దీనిపై తాము ఓ నిర్ణయం తీసుకుంటామని, అప్పుడు ఈ సమస్య పరిష్కారం వీలైనంత త్వరలో సాధ్యమవుతుందని రిలయన్స్ పవర్‌కు ఒప్పందదారులు చెప్పినట్లు పిటిఐకి విజయానంద్ చెప్పారు.