బిజినెస్

ఈ ఆర్థిక సంవత్సరం భారత జిడిపి వృద్ధిరేటు అంచనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

7.3 శాతం: ఐఎమ్‌ఎఫ్

వాషింగ్టన్: భారత జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) 7.3 శాతంగా నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎమ్‌ఎఫ్ బుధవారం అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) ఇది 7.5 శాతంగా ఉండొచ్చని పేర్కొంది. ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను స్వాగతించిన ఐఎమ్‌ఎఫ్.. ప్రస్తుతం భారత ఔట్‌లుక్ బాగుందని అభిప్రాయపడింది. కాగా, 2015-16లో దేశ జిడిపి 7.6 శాతంగా నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేయగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) 7.4 శాతంగా ఉండొచ్చని చెప్పడం తెలిసిందే.

7.6 శాతం: నొమురా

న్యూఢిల్లీ: భారత జిడిపి వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) 7.6 శాతంగా నమోదు కావచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఇది 7.8 శాతంగా ఉండొచ్చని జపాన్‌కు చెందిన ఆర్థిక సేవల దిగ్గజం నొమురా బుధవారం అంచనా వేసింది. ద్రవ్యోల్బణం అదుపు, కార్పొరేట్ సంస్థల లాభాలు, ప్రభుత్వ సంస్కరణలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యవిధానంపై దేశ జిడిపి వృద్ధిరేటు ఆధారపడి ఉందని చెప్పింది. కాగా, ఏప్రిల్‌లో జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల చొప్పున ఆర్‌బిఐ తగ్గించడానికి అవకాశాలున్నాయని నొమురా తెలిపింది.