బిజినెస్

రెండోరోజూ అదే దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో బడ్జెట్ జోష్ బుధవారం కూడా కొనసాగింది. మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఏడేళ్ల గరిష్ఠ స్థాయి లాభాన్ని అందుకున్నది తెలిసిందే. ఒక్కరోజే 777 పాయింట్లు పుంజుకుంది. ఈ క్రమంలో బుధవారం మరో 464 పాయింట్లు ఎగిసింది. ఫలితంగా సెనె్సక్స్ 24 వేల స్థాయిని అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,300 మార్కును దాటింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. బ్యాంకుల మూలధన నిధుల సమీకరణకు సంబంధించిన నిబంధనలను సరళతరం చేయడంతో బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బాసెల్-3 నిబంధనల ప్రకారం బ్యాంకులు సమకూర్చుకోవాల్సిన మూలధనం విషయంలో ఉన్న నియమాలను ఆర్‌బిఐ సడలించడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచిందని ఆర్థిక నిపుణులు విశే్లషిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) ద్రవ్యలోటును జిడిపిలో 3.5 శాతానికే కట్టడి చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన వార్షిక సాధారణ బడ్జెట్‌లో చెప్పడం మదుపరులలో ఉత్సాహం నింపిందని, వృద్ధిరేటు పురోగతికి రాబోయే ద్రవ్యసమీక్షలో ఆర్‌బిఐ కీలక వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా మదుపరులను పెట్టుబడుల వైపునకు నడిపిస్తున్నాయని, ఈ క్రమంలో మూలధన సమీకరణ నిబంధనలను ఆర్‌బిఐ సరళతరం చేయడం మార్కెట్‌ను పరుగులు పెట్టించిందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బుధవారం కూడా పెరగడం మరోసారి స్టాక్ మార్కెట్ల భారీ లాభాలకు దోహదం చేసింది. మంగళవారం 57 పైసలు బలపడిన రూపాయి విలువ.. బుధవారం మరో 31 పైసలు ఎగిసింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్లపైనా పడగా, సెనె్సక్స్ 463.63 పాయింట్లు పుంజుకుని 24,242.98 వద్ద, నిఫ్టీ 146.55 పాయింట్లు అందుకుని 7,368.85 వద్ద ముగిశాయి. ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్ల లాభాలూ కలిసిరాగా, ఉదయం ప్రారంభం నుంచి లాభాల్లోనే కదలాడిన సూచీలు చివరిదాకా ఆ లాభాలను నిలబెట్టుకోగా, మంగళ, బుధవారాల్లో సెనె్సక్స్ 1,240 పాయింట్లకుపైగా, నిఫ్టీ 380 పాయింట్లకుపైగా ఎగబాకాయి. రియల్టీ, బ్యాంకింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పిఎస్‌యు, ఐటి, విద్యుత్ రంగాల షేర్ల విలువ 5.05 శాతం నుంచి 2.13 శాతం వరకు పెరిగింది. బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ సూచీ 2.21 శాతం, మిడ్-క్యాప్ సూచీ 1.88 శాతం చొప్పున పెరిగాయి.
రెండు రోజుల్లో రూ. 4 లక్షల కోట్లు
పెరిగిన మదుపరుల సంపద
దేశీయ స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో మదుపరుల సంపద కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. మంగళవారం 2.5 లక్షల కోట్ల రూపాయలు పెరిగితే, బుధవారం మరో లక్షన్నర కోట్ల కోట్ల రూపాయలు ఎగిసింది. దీంతో ఈ రెండు రోజుల్లో 4 లక్షల కోట్ల రూపాయల మేర మదుపరుల సంపద పెరిగినట్లైంది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ 89,96,983 కోట్ల రూపాయలుగా ఉంది. బడ్జెట్ అనంతర ర్యాలీలో 4,13,838 కోట్ల రూపాయలు పెరిగింది.