బిజినెస్

బ్యాంకర్లకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మూలధన నిధుల సమీకరణకు సంబంధించి బ్యాంకులకున్న నిబంధనలను సడలించడం ఆహ్వానించదగ్గ పరిణామంగా ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ నేపథ్యంలో బుధవారం ఇక్కడ పారిశ్రామిక రంగంతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని, దానికి వెన్నుదన్నుగా నిలుస్తామని అన్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని మొండి బకాయలు వాటి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న క్రమంలో జైట్లీ భరోసా బ్యాంకర్లలో కొత్త ఆశలు నింపినట్లైంది. ఇకపోతే ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఇపిఎఫ్) విత్‌డ్రాయల్స్‌పై పన్ను ప్రతిపాదన గురించి మాట్లాడుతూ బడ్జెట్‌పై జరిగే చర్చలో దాని గురించి స్పందిస్తానని తెలిపారు. అలాగే దేశీయంగా నల్లధనం నివారణలో భాగంగా తెచ్చిన నల్లధన వివరాల వెల్లడి కార్యక్రమం.. అక్రమార్కులను క్షమించడానికి తీసుకొచ్చినది కాదన్నారు. బ్లాక్‌మనీ కంప్లీయెన్స్ విండో ద్వారా బయటికొచ్చిన నల్లధనంపై సాధారణంగా విధించే 30 శాతం పన్ను కంటే అధికంగా 45 శాతం పన్నును విధిస్తామన్నారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016- 17)గాను వేసిన జిడిపి వృద్ధిరేటు అంచనా 7-7.75 శాతాన్ని మించి వృద్ధిరేటు నమోదు చేయగలమన్న విశ్వాసాన్ని జైట్లీ ఈ సందర్భంగా వెలిబుచ్చారు. అయితే వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర కీలక ఆర్థిక సంస్కరణల అమలులో ఎలాంటి అడ్డంకులు, ముఖ్యంగా రాజకీయ జోక్యం లేకపోతేనే ఇది సాధ్యమన్నారు. కాగా, పన్ను విధానాన్ని వివాదాస్పదంగా కాకుండా స్నేహపూరితంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తోందని జైట్లీ తెలిపారు. మరోవైపు ఆర్‌బిఐ తాజా నిబంధనల సడలింపును బ్యాంకర్లు స్వాగతించారు. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య మాట్లాడుతూ మూలధన నిధుల సమీకరణ విషయంలో ఆర్‌బిఐ తమకు ఊరటనిచ్చిందన్నారు.

చిత్రం... పారిశ్రామిక సమావేశంలో మాట్లాడుతున్న జైట్లీ

భారత్‌లో సామ్‌సంగ్ మొబైల్స్
అత్యంత విశ్వసనీయ బ్రాండ్

ముంబయి, మార్చి 2: దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ మొబైల్స్.. భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌గా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో సోనీ, ఎల్‌జి ఉండగా, టాప్-5లో భారత్ తరఫున టాటా గ్రూప్‌కు మాత్రమే చోటు లభించింది. ఈ మేరకు ఓ సర్వే తెలియపరచగా, 21-50 వయసులో ఉన్న 2,500 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు. ‘ది బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్, ఇండియా స్టడీ 2016’ పేరిట ఈ సర్వే జరిగింది. ట్రస్ట్ రిసెర్చ్ అడ్వైజరీ (టిఆర్‌ఎ) ద్వారా ఏటా ఈ సర్వే జరుగుతుండగా, నోకియా కూడా టాప్-5లో ఉంది. కాగా, గత ఏడాది సర్వేలో సామ్‌సంగ్ మొబైల్స్ రెండో స్థానంలో ఉండగా, ఎల్‌జి మొదటి స్థానంలో ఉంది.

ఫిబ్రవరిలో పెరిగిన
బజాజ్ ఆటో విక్రయాలు
న్యూఢిల్లీ, మార్చి 2: దేశీయ ద్విచక్ర, త్రిచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో అమ్మకాలు గత నెల ఫిబ్రవరిలో గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే 12 శాతం పెరిగాయి. ఈ మేరకు బుధవారం బజాజ్ ఆటో తెలిపింది. ఈ ఫిబ్రవరిలో మొత్తం వాహన విక్రయాలు 2,72,719 యూనిట్లుగా ఉంటే, పోయినసారి ఫిబ్రవరిలో 2,43,319 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 9 శాతం వృద్ధితో 2,35,282 యూనిట్లుగా ఉంటే, క్రిందటిసారి 2,16,077 యూనిట్లుగా ఉన్నాయి. వాణిజ్య వాహనాల విషయానికొస్తే 37 శాతం వృద్ధి నమోదవగా, గత నెల 37,437 యూనిట్లను అమ్మిన బజాజ్.. గత ఏడాది ఫిబ్రవరిలో 27,242 యూనిట్ల విక్రయాలకే పరిమితమైంది. కాగా, ఎగుమతులు మాత్రం 12 శాతం పడిపోయినట్లు తెలిపింది. ఈసారి 98,959 యూనిట్లు జరిగితే, పోయినసారి 1,12,909 యూనిట్లు జరిగాయి.

మాల్యాను అరెస్టు చేయాలి: ఎస్‌బిఐ
ముంబయి, మార్చి 2: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో విజయ్ మాల్యాను అరెస్టు చేయాలని బుధవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ డిమాండ్ చేసింది. మాల్యా పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని కూడా కోరింది. రూ. 7,000 కోట్లకుపైగా కింగ్‌ఫిషర్ బకాయిల వ్యవహారంలో 17 బ్యాంకుల కూటమికి ఎస్‌బిఐ నేతృత్వం వహిస్తున్నది తెలిసిందే. ఇప్పటికే మాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన ఎస్‌బిఐ.. తాజాగా బెంగళూరులోని డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. ఈ క్రమంలోనే మాల్యా అరెస్టును కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

5 లక్షలు పెరగనున్న బెంజ్ కార్ల ధరలు
న్యూఢిల్లీ, మార్చి 2: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్.. దేశీయ మార్కెట్‌లో తమ కార్ల ధరలను లక్ష రూపాయల నుంచి రూ. 5 లక్షల వరకు పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ నెల 15 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిపాదించిన లగ్జరీ ట్యాక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ ప్రభావమే ఈ ధరల పెంపు అని బెంజ్ తెలిపింది. ప్రస్తుతం బెంజ్ కార్ల ధరలు రూ. 28 లక్షల నుంచి రూ. 1.67 కోట్ల మధ్య ఉన్నాయి.