బిజినెస్

నగల వ్యాపారంలో నల్లధనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బంగారు, రత్నాభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని తిరిగి విధించడానికి నిరసనగా బంగారు నగల వ్యాపారులు చేపట్టిన మూడు రోజుల దేశవ్యాప్త సమ్మె ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు దేశంలో నల్లధనం తయారు కావడానికి ఈ రంగం దోహదపడుతోందని, దీన్ని పన్ను పరిధిలోకి తీసుకు రావలసిన అవసరం ఉందని ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డు (సిబిఇసి) అభిప్రాయ పడింది. ‘ఆభరణాల రంగాన్ని పన్ను పరిధిలోకి తీసుకు వచ్చాం. రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రయత్నించి ఉపసంహరించుకున్న సుంకమే ఇది. ఈ రంగాన్ని పన్ను పరిధిలోకి తీసుకు రావలసిన అవసరం ఉందనే విషయంలో మీరు కూడా నాతో ఏకీభవిస్తారని నేను అనుకుంటున్నాను’ అని సిబిఇసి చైర్మన్ నజీబ్ షా గురువారం ఇక్కడ అసోచామ్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. లెక్కల్లోకి రాని సంపద తయారు కావడానికి దోహదపడుతున్న రంగమిదని కూడా ఆయన అన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2016-17 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో బంగారు ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాల వర్తకులు బుధవారంనుంచి మూడు రోజులు సమ్మె చేస్తున్నారు. మన దేశంలో పన్ను పరిధికి వెలుపల ఉండే అనేక రంగాలున్నాయని షా అంటూ, అయితే సెన్‌వాట్ క్రెడిట్ నిబంధనల్లో మార్పుల కారణంగా రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌కు వెయ్యి కోట్ల మేర ఆదాయం రానుందని చెప్పారు. అయితే తమకు వచ్చే ఆదాయానికి మించి, పరిశ్రమ వర్గాలకు, డిపార్ట్‌మెంట్‌కు మధ్య న్యాయపరమైన వివాదాల ఖర్చే అధికంగా ఉంటున్నందున ఇది అత్యవసరమని తాము భావించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం కొన్ని సుంకాలను పెంచిందని షా గుర్తు చేస్తూ, రక్షణ రంగంలో మాదిరిగా భారతీయ పరిశ్రమలకు కూడా సమాన అవకాశాలు ఉండేలా చూడడం కోసం ఇలా చేసినట్లు తెలిపారు. వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) కావాలని అనుకుంటే మినహాయింపులు అడగడం మానేయాలని ఎందుకంటే ఒక ఓరలో రెండు కత్తులు ఇమడవని ఆయన పరిశ్రమ వర్గాలకు హితవు చెప్పారు.
రెండో రోజూ సమ్మె
ఇదిలా ఉండగా, బంగారు ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించడానికి నిరసనగా గురువారం రెండో రోజు కూడా దేశంలోని అనేక ప్రాంతాల్లో బంగారం దుకాణాలు మూతపడ్డాయి. ఢిల్లీలో రెండో రోజు కూడా వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారని ఆలిండియా సరఫా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సురీందర్ కుమార్ జైన్ చెప్పారు. ఒక్క ఢిల్లీలోనే ఆరువేలకు పైగా బంగారు షాపులు మూతపడ్డాయని ఆయన చెప్పారు. జైపూర్, లక్నో, చండీగఢ్, జమ్మూ, తదితర నగరాల్లో బంగారు దుకాణాల యజమానులు, స్వర్ణకారులు కూడా తమ దుకాణాలను మూసివేసి దేశవ్యాప్త సమ్మెలో పాలు పంచుకున్నారు.