బిజినెస్

ఏపి, మరోమూడు రాష్ట్రాల్లో నాలుగు కొత్త మేజర్ పోర్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పిపిపి) పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం 32 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కొత్తగా నాలుగు మేజర్ పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. నౌకాయాన శాఖ సహాయ మంత్రి పోన్ రాధాకృష్ణన్ గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని దుగరాజపట్నం (సుమారు రూ.6 వేలకోట్ల పెట్టుబడితో), తమిళనాడులోని కోలాచెల్ (సుమారు రూ.6 వేలకోట్ల పెట్టుబడి), మహారాష్టల్రోని దహాను (సుమారు రూ.9 వేలకోట్ల పెట్టుబడి), పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలెండ్ (సుమారు రూ.11 వేలకోట్ల పెట్టుబడి)లలో కొత్తగా నాలుగు మేజర్ పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. అంతేకాకుండా దాదాపు రూ.11 వేలకోట్ల వ్యయంతో ట్యుటికోరిన్ (తమిళనాడు)లోని విఓసి పోర్టులోనూ, రూ.5 వేలకోట్ల వ్యయంతో పారదీప్ (ఒడిశా) పోర్టులోనూ ఔటర్ హార్బర్ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రతిపాదించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో 12 మేజర్ పోర్టులు ఉన్నాయని, అలాగే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో మరో దాదాపు 200 నాన్-మేజర్ పోర్టులు ఉన్నాయని, గత ఏడాది మార్చి 31వ తేదీ నాటికి మేజర్ పోర్టుల సామర్ధ్యం 871.52 మిలియన్ టన్నులుగానూ, నాన్-మేజర్ పోర్టుల సామర్ధ్యం 658.71 మిలియన్ టన్నులుగానూ ఉందని రాధాకృష్ణన్ తెలిపారు.