బిజినెస్

చార్జీల పెంపు తప్పదు చమురు ధరల పతనంతో భారత్‌కు ఎంతో లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పతనమవడం భారత్‌కు ‘ఎంతో సానుకూల’ అంశంగా పరిణమించిందని, దీని వలన భారత్ ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించుకోగలగడంతో పాటు సరుకులు, సేవలపై అధిక మొత్తాన్ని వెచ్చించేందుకు వీలు కలిగిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. ‘అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గడం భారత్‌కు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. దీని వలన భారత్‌లో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గి దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడటంతో సరుకులు, సేవలకు అధిక మొత్తంలో నిధులు వెచ్చించేందుకు వెసులుబాటు కలిగింది’ అని ఐఎంఎఫ్ ఇండియా టీమ్ అధినేత పాల్ కషిన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు గత 18 నెలల్లో గణనీయంగా పతనమై ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 35 డాలర్లకు క్షీణించిన నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్థికాభివృద్ధిలో భారత్ ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతంగా ఉన్న స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) రేటు వచ్చే ఏడాది 7.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు ఐఎంఎఫ్ తన తాజా నివేదికలో పేర్కొంది. భారత్‌లో పెట్టుబడుల వలయం ఇంకా బలం పుంజుకోవాల్సి ఉందని, మొండి బకాయిలు బ్యాంకింగ్ రంగాన్ని నీరుగారుస్తున్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం భారత ఎగుమతులను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఐఎంఎఫ్ స్పష్టం చేసింది.

ఏపి విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్
విశాఖపట్నం, మార్చి 3: విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం కానుందని, అయితే ఇది ప్రజారంజకంగాను, సామాన్యులకు ఇబ్బంది లేనిదిగా ఉంటుందని ఎపి విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ భవానీప్రసాద్ పేర్కొన్నారు. ఎపి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన రిటైల్ వ్యాపారం, సమగ్ర ఆదాయ ఆవశ్యకత నివేదికపై గురువారం సంస్థ కార్యాలయంలో బహిరంగ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చార్జీల పెంపు సామాన్యునికి ఇబ్బంది కలిగించనిదిగా ఉంటుందన్నారు. ఈ క్రమంలోనే చార్జీల విధానాన్ని రూపొందించామన్నారు. తామంతా విద్యుత్ వ్యవస్థలో భాగమేనని, ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు, న్యాయస్థానాల ఉత్తర్వులు, చట్టంలోని నిబంధనలకు తగ్గట్టుగా మాత్రమే రూపొందిస్తామన్నారు. గృహాలు, పరిశ్రమలు, వ్యవసాయం, వ్యవసాయ అధారిత పరిశ్రమలు వంటి వాటికి వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఎనర్జీ ఎఫిషియన్సీ (ఇఇసి) ద్వారా త్వరలో వినియోగదారులకు ఫ్యాన్లు సరఫరా చేసే విధానం అమలు కానుందన్నారు. ఒక్కో ఫ్యాన్ రూ.950లు ధర ఉంటుందని, ఇది కూడా నెలవారి బిల్లులో చెల్లించే సౌలభ్యం కల్పిస్తామన్నారు. విద్యుత్‌ను ఆదా చేసే ఎల్‌ఇడి బల్బుల పంపిణీ రాష్ట్రం అంతటా చేపట్టామన్నారు. ఎల్‌ఇడి బల్బుల పంపిణీతో సంస్థకు రూ.250 కోట్ల మేర ఖర్చు తగ్గించదన్నారు.
వీటి పంపిణీతో దేశంలోనే ఎపి ప్రథమ స్థానంలో నిలిచిందని, ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ప్రశంసలు, అభినందనలు అందుకున్నాయన్నారు. ఎపి విద్యుత్ నియంత్రణమండలి సభ్యులు రమణ, పి.రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.