బిజినెస్

ఆశలన్నీ ఐటిసి కొనుగోళ్లపైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి: ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు వేలం ప్రారంభానికి ఈ నెల 11న ముహుర్తం ఖరారు కావడంతో రైతులు గిట్టుబాటు ధరపై ఆశలు పెట్టుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా వరుసగా నష్టాలు చవిచూస్తున్న రైతులు ఈ సంవత్సరమైనా గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు మార్కెటును శాసించే ఐటిసి సంస్థపైనే గట్టి నమ్మకంతో ఉన్నారు. ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో ఐటిసి సంస్థ సుమారు 60 నుండి 65 శాతం పొగాకు కొనుగోలు చేస్తోంది. ఐటిసి ఛైర్మన్ వైసి దేవేశ్వర్ వైఖరిపై పొగాకు రైతుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. గత సంవత్సరం సరాసరి రేటు కిలో రూ.116 పలకగా ప్రతి రైతు బ్యారన్‌కు లక్ష రూపాయల పైనే నష్టపోయారు. ఈ ఏడాది బ్యాంకులు రుణాలు రీషెడ్యూలు చేసి బ్యారన్‌కు నాలుగు నుండి అయిదు లక్షల రూపాయలు రుణం ఇవ్వడంతో పొగాకు నాట్లు వేశారు. పొగాకు బోర్డు ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో బ్యారన్‌కు 25 క్వింటాళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ విధంగా ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో 35 మిలియన్ కిలోలకు మాత్రమే అధికారికంగా అనుమతించగా, ప్రస్తుత అంచనాల ప్రకారం 48 నుండి 50 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రైతులు బ్యారన్‌కు అయిదు లక్షలకు పైగా విక్రయిస్తే గానీ గట్టెక్కే అవకాశం లేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం కిలో రూ.170 నుండి రూ.175 సరాసరి రేటు వస్తేనే కాని రైతులు రుణాల నుండి విముక్తి పొందే అవకాశం లేదు. ఎన్‌ఎల్‌ఎస్ మార్కెటులో ఐటిసి 50 నుండి 60 శాతం, జిపిఐ 10 నుండి 11 శాతం, డక్కన్ తొమ్మిది నుండి పది శాతం, పిఎస్‌ఎస్ ఆరు నుండి ఎనిమిది శాతం, ఎంఎల్ నాలుగు నుండి అయిదు శాతం, ఎలయెన్స్ నాలుగుశాతం, మిగిలిన సంస్థలైన బొమ్మిడాల, ఎథిలిక్, ఐటిటి, మిట్టపల్లి 1,2 కంపెనీలు ఎన్‌ఎల్‌ఎస్ పొగాకును కొనుగోలు చేస్తున్నాయి. గత సంవత్సరం కేవలం రూ.116 ధర లభించడంతో పొగాకు సాగు చేద్దామా వద్దా అనే అనిశ్చితి స్థితిలో రైతులుండగా కొన్ని కంపెనీల ప్రోత్సాహంతోపాటు బ్యాంకులు రుణాలు ఇవ్వడం, ప్రత్యామ్నాయ పంటలు లేకపోవడంతో నాట్లు వేశారు. గత ఏడాది ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో వేలం ప్రారంభంలో రూ.140 అధిక రేటు ప్రకటించగా క్రమంగా రూ.160, రూ.170 వరకు రేటు పలికింది. గత సంవత్సరం ఎస్‌ఎల్‌ఎస్ ఏరియాలో రూ.125 అధిక రేటు పలకగా, క్రమంగా రూ.140కు చేరింది. ఈ ఏడాది ఎస్‌ఎల్‌ఎస్ ఏరియాలో పొగాకు వేలం ఇప్పటికే ప్రారంభమైంది. ప్రారంభంలో రూ.140 రేటు పలికింది. ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాలో ఈ సంవత్సరం ప్రారంభ ధర కనీసం రూ.170 ఉండాలని రైతు నేతలు కోరుతున్నారు. అధిక రేటు రూ.210, సరాసరి రూ.180 ఉంటే కానీ బ్యాంకు రుణాలు తీరవని రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ సంవత్సరం ఐటిసి ఛైర్మన్ దేవేశ్వర్ ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాపై దృష్టి పెట్టి పొగాకు కొనుగోలుచేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పొగాకు గ్రేడును బట్టి కూడా రేటు ఉంటుందని, గత సంవత్సరం ఆరెంజ్‌కు రేటు పలికిందని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం ఇన్‌చార్జి సూపరింటెండెంటు వైవి ప్రసాదు తెలిపారు. పొగాకును ముఖ్యంగా అయిదు రకాలుగా విభజిస్తారని, ఒకటో రెలుపు ప్రీమియం, రెండు, మూడు అయిదారు పట్లు వరకు ఖత్తర్ అని, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది రెలుపులు క్వాలిటీ లీఫ్‌లని, 10,11 చిప్స్‌గా విభజిస్తామని తెలిపారు. విదేశీ ఆర్డర్లపై కూడ పొగాకు మార్కెట్ ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు. లో టాపింగ్‌లో ఆరెంజ్, హై టాపింగ్‌లో లెమన్ కలర్స్ వస్తాయని తెలిపారు. రైతులు గ్రేడింగును నిపుణులైన కూలీలతో చేయించుకోవాలని ప్రసాద్ సూచించారు.

వేలం కేంద్రంలో పొగాకు బేళ్లు

త్వరలో మూడో విడత గోల్డ్ బాండ్

న్యూఢిల్లీ, మార్చి 3: తొలి రెండు విడతల్లో రూ. 1050 కోట్లకు పైగా ఆర్జించిన ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సావరిన్ గోల్డ్ బాండ్ పథకం మూడోవిడతను జారీ చేస్తుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ గురువారం చెప్పారు. ‘త్వరలోనే నేను మీ ముందుకు వస్తాను. అయితే కచ్చితమైన తేదీ నేను చెప్పలేను. ఎందుకంటే బంగారం ధరలపై ఊహాగానాలున్నాయి’ అని ఆయన చెప్పారు. ప్రభుత్వం సావరిన్ బంగారం బాండ్ల పథకం తొలి విడతను గత నవంబర్‌లో ప్రకటించగా, దానికి రూ 246 కోట్ల విలువైన 915.95 కిలోల బంగారానికి దరఖాస్తులు వచ్చాయి. గత జనవరిలో రెండో విడత విక్రయాలను ప్రకటించగా రూ. 798 కోట్ల విలువైన 3,071 కిలోల బంగారానికి చందాలు వచ్చాయి. మూడో విడత పథకాన్ని విజయవంతం చేయడానికి తాము మరింత ప్రచారం, పెద్ద ఎత్తున అడ్వర్టయిజ్‌మెంట్లకు వెళ్తామని కూడా దాస్ చెప్పారు.