బిజినెస్

పారిశ్రామిక రంగంలో రాణిస్తున్న మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: భారతీయ మహిళలు పారిశ్రామిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని సిఐఐ తెలంగాణ విభాగం చైర్‌పర్సన్ దాట్ల వనిత అన్నారు. రానున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిఐఐ ఆధ్వర్యంలోని మహిళా పారిశ్రామికవేత్తల సమావేశం శుక్రవారం ఇక్కడ జరిగింది. ఇందులో పలు సంస్థల మహిళాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని మహిళలకు సూచించారు. కుటుంబ పరంగా అనేక ఒత్తిడులు ఉన్నా, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు మహిళలు అంకితం కావాలన్నారు. అన్ని రంగాల్లో మహిళలకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని, ఇంజినీరింగ్, ఐటి, పారిశ్రామిక, వైద్య రంగాల్లో మహిళలు దూసుకుపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్‌పర్సన్ సుచిత్ర ఎల్లా తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొన్న మహిళా పారిశ్రామికవేత్తలు