బిజినెస్

వాహన ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌ఎమ్‌ఐఎల్).. శుక్రవారం కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల మోడళ్లపై కనిష్టంగా 2,889 రూపాయలు, గరిష్ఠంగా 82,906 రూపాయల చొప్పున ధరలను పెంచుతున్నామని స్పష్టం చేసింది. పెరిగిన ధరలు ఈ నెల 1 నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్‌సిఐఎల్) సైతం తమ కార్ల ధరలను 79,000 రూపాయల వరకు పెంచింది. ప్రస్తుతం తాము విక్రయిస్తున్న మోడళ్లపై కనిష్టంగా 4,000 రూపాయల నుంచి గరిష్ఠంగా 79,000 రూపాయల వరకు పెంచామని, పెరిగిన ధరలు ఈ నెల 1 నుంచే వర్తిస్తాయని శుక్రవారం స్పష్టం చేసింది. మహీంద్ర అండ్ మహీంద్ర కూడా తమ కార్ల ధరలను 47,000 రూపాయల వరకు పెంచుతున్నట్లు శుక్రవారం పేర్కొంది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. వివిధ మోడళ్లపై కనిష్టంగా 5,500 రూపాయల నుంచి గరిష్ఠంగా 47,000 రూపాయల వరకు ధరలను పెంచుతున్నట్లు వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గత నెల 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో ఎక్సైజ్ పన్ను, అదనపు సెస్ పెంపును ప్రతిపాదించడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని ఆటోరంగ సంస్థలన్నీ పేర్కొన్నాయి. ఇకపోతే ఇప్పటికే ఇదే కారణంతో మారుతి సుజుకి, టాటా మోటార్స్, టొయోటా, మెర్సిడెస్ బెంజ్, జనరల్ మోటార్స్, బిఎమ్‌డబ్ల్యు, రెనాల్ట్, నిస్సాన్, స్కోడా సంస్థలు కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయ.