బిజినెస్

ఈ ఏడాదీ ఆర్థిక ఇబ్బందులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: ఈ ఏడాదికిగాను జిడిపి వృద్ధిరేటు లక్ష్యాన్ని 6.5-7 శాతానికి తగ్గించింది చైనా. ఆ దేశ ప్రధాని లీ కెక్వియాంగ్ శనివారం ఇక్కడ నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ వార్షిక సమావేశం సందర్భంగా తమ ప్రభుత్వ పనితీరుపై ఓ నివేదిక విడుదల చేశారు. ఎన్‌పిసిలోని 3,000 మంది సభ్యులకు ఈ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా మున్ముందు ఇబ్బందికర పరిస్థితులు తప్పవని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఆయ న పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం ఉపాధి, వ్యక్తిగత ఆదాయాలపై ప్రభావం చూపవచ్చన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా జిడిపి వృద్ధిరేటు గత ఏడాది 26 ఏళ్ల కనిష్టానికి క్షీణించి 7 శాతం దిగువన 6.9 శాతంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది కూడా గడ్డు పరిస్థితులు తప్పవని చైనా ప్రధాని చెప్పారు. 2015లో 10.4 ట్రిలియన్ డాలర్లు (67.7 ట్రిలియన్ యువాన్లు)గా ఉన్న చైనా జిడిపి విలువ.. 2014లో 10 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. అమెరికా డాలర్‌తో పోల్చితే చైనా కరెన్సీ యువాన్ విలువ పడిపోవడం దీనికి ప్రధాన కారణమవగా, దిగజారిన ఎగుమతులూ ఓ కారణమే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారవచ్చని అంచనా వేసిన చైనా సర్కారు.. జిడిపి వృద్ధిరేటు 6.5-7 శాతం మధ్యే ఉండొచ్చని అంచనా వేసింది. ఇదిలావుంటే 2011-15 మధ్య చైనా జిడిపి వృద్ధి వార్షిక సగటు 7.8 శాతంగా నమోదైంది.