బిజినెస్

మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన కోల్ ఇండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి మధ్యంతర డివిడెండ్‌గా కేంద్ర ప్రభుత్వం 17,308 కోట్ల రూపాయలను అందుకోనుంది. శనివారం సంస్థలోని ఒక్కో షేర్‌కు 27.40 రూపాయల చొప్పున డివిడెండ్ ట్యాక్స్ కలుపుకుని మొత్తం 20,830 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను కోల్ ఇండియా ప్రకటించింది. సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 79.64 శాతం వాటా ఉండటంతో 17,308 కోట్ల రూపాయలు దక్కనున్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి పన్నుయేతర ఆదాయానికి మరిన్ని మార్గాలను అనే్వషిస్తున్న సర్కారుకు ఇది కలిసిరానుంది.