బిజినెస్

ఆలోచనలకు పదును పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆలోచనలకు పదును పెట్టాలని, సామర్థ్యం పెంచుకోవాలని, పనికి వెనకాడొద్దంటూ టి-హబ్ ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు బిపిఎల్ మొబైల్ వ్యవస్థాపకుడు రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని టి-హబ్ వద్ద ఆయన ఔత్సాహిక పారిశ్రామిక, వ్యాపారవేత్తలనుద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టి-హబ్ సిఇఒ జై కృష్ణన్, వ్యవస్థాపక సిఒఒ శ్రీనివాస్ కొల్లిపర, తెలంగాణ ఐటి కార్యదర్శి జయేశ్ రంజన్, పలువురు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు కూడా పాల్గొనగా, అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రపంచ ఐటి దిగ్గజాల నడుమ పనిచేసిన రాజీవ్.. టి-హబ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు విలువైన సలహాలు, సూచనలను అందజేశారు. నూతన ఆలోచనలకు, గొప్ప అనుభవాలను పంచుకోవడానికి టి-హబ్ అద్భుతమైన వేదిక అని అభిప్రాయపడ్డారు. అనంతరం తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రి కెటిఆర్‌ను రాజీవ్ చంద్రశేఖర్ కలుసుకున్నారు. పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీని వాడుకోవాలని కోరారు. దీంతో ఆయన సలహాను అభినందించిన కెటిఆర్.. వివిధ రంగాల్లో టెక్నాలజీని ఏ విధంగా వినియోగించాలన్నదానిపై చర్చించారు. అలాగే టెక్నాలజీ వినియోగం ద్వారా జిహెచ్‌ఎమ్‌సిని ప్రజలకు దగ్గర చేసేందుకు ఓ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌ను నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు రాజీవ్‌కు కెటిఆర్ చెప్పారు. కర్నాటక నుంచి ఎంపీగా ఉన్న రాజీవ్.. అంతర్జాతీయ స్థాయిలో ఇంటెల్ సంస్థలో పనిచేశారు. ఈ క్రమంలోనే 1995లో భారతీయ తొలి మొబైల్ సేవల సంస్థ బిపిఎల్ మొబైల్‌ను స్థాపించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోనేగాక, సేవా, దాతృత్వ గుణాల్లోనూ ముందున్న రాజీవ్.. రక్షణ శాఖ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీల్లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

2016-17 బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
660 లక్షల టన్నులు: సింగరేణి సిఎండి

హైదరాబాద్, మార్చి 5: వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 660 లక్షల టన్నులుగా నిర్ణయించినట్లు సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ ఎన్ శ్రీధర్ తెలిపారు. శనివారం సింగరేణి భవన్‌లో ఏరియా చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లతో బొగ్గు గనుల తవ్వకాలు, లక్ష్యాలపై సమీక్షించారు. ఈ మార్చి నెలకు నిర్ధేశించుకున్న 60 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధిస్తే అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించిన సంస్థగా సింగరేణి కొత్త రికార్డు నెలకొల్పబోతోందన్నారు.