బిజినెస్

బడ్జెట్ తర్వాత డివిడెండ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ వెలువడిన తర్వాత డజనుకుపైగా సంస్థలు డివిడెండ్లను ప్రకటించాయి. ఇలా డివిడెండ్ ప్రకటించిన సంస్థల్లో అల్కెమ్ లాబొరేటరీస్, కాడిలా హెల్త్‌కేర్, సువెన్ లైఫ్ సైనె్సస్ తదితర సంస్థలున్నాయి. మరికొన్ని సంస్థలు కూడా త్వరలోనే డివిడెండ్లు ప్రకటించనున్నాయి. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డిడిటి) కాకుండా ఏడాదికి పది లక్షలకుపైగా డివిడెండ్లు అందుకునే వ్యక్తులు, అవిభక్త కుటుంబాలు, సంస్థలు అందుకునే మొత్తం డివిడెండ్ సొమ్ముపై 10 శాతం పన్ను విధించనున్నట్లు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2016-17 సాధారణ బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఈ కొత్త పన్ను ప్రతిపాదన ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. ఈ డిడిటి నిబంధన వారి ఆదాయ శ్లాబ్‌లతో సంబంధం లేకుండా మదుపరులందరికి వర్తిస్తుంది. ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ప్రభావంతో ప్రమోటర్లు అందరు కూడా మార్చి 31లోగా అధిక డివిడెండ్లను ప్రకటించేలా సంస్థలను ప్రోత్సహించే అవకాశముందని సెంట్రల్ వెల్త్ రిసెర్చ్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. ఇప్పటివరకు 13 సంస్థలు బడ్జెట్ ప్రకటన తర్వాత డివిడెండ్లు ప్రకటించాయి. వీటిలో ఏజిస్ లాజిస్టిక్స్, ఆల్‌కార్గో ఇండస్ట్రీస్, దివీస్ లాబ్స్, గోద్రెజ్ ఇండస్ట్రీస్‌లాంటివి కూడా ఉన్నాయి.
కాగా, ప్రమోటర్ల వాటా అధికంగా ఉండే సంస్థలు మార్చి 31కన్నా ముందే తమ డివిడెండ్లను ప్రకటించవచ్చని ఎందుకంటే అలా చేయకపోతే తాము పొందే డివిడెండ్ ఆదాయంపై పది శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆ నివేదిక పేర్కొంది. దీనివల్ల రాబోయే నెల రోజుల్లో డివిడెండ్ల పంపిణీ జోరందుకునే అవకాశముంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను పార్లమెంట్‌లో సాధారణ వార్షిక బడ్జెట్‌ను ప్రకటించినది తెలిసిందే.

మైక్రోమ్యాక్స్ సిఇఒగా వినీత్ తనేజా రాజీనామా
న్యూఢిల్లీ, మార్చి 6: దేశీయ రెండో అతిపెద్ద మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ సిఇఒగా వినీత్ తనేజా తప్పుకున్నారు. సంస్థ అమ్మకాలు పడిపోతున్న నేపథ్యంలో తనేజా తన పదవికి రాజీనామా చేశారు. గత రెండేళ్లుగా ఆయన మైక్రోమ్యాక్స్ సిఇఒగా పనిచేశారు. కాగా, ఇతరత్రా కారణాల దృష్ట్యానే తనేజా రాజీనామా చేశారని మైక్రోమ్యాక్స్ అధికార ప్రతినిధి ఒకరు ఓ ఈ-మెయిల్ ప్రకటనలో తెలిపారు. సంస్థకు ఆయన అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన భవిష్యత్ కాలం బాగుండాలని ఆశించారు.