బిజినెస్

సిఐఐ యంగ్ ఇండియన్స్ హైదరాబాద్ చాప్టర్ నూతన కార్యవర్గం ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) యంగ్ ఇండియన్స్ (వైఐ) హైదరాబాద్ చాప్టర్ చైర్మన్‌గా జెజిఐ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ డిపి, కో చైర్మన్‌గా సందీప్ రాఠీలు ఎన్నికైనట్లు ఆయా వర్గాలు తెలిపాయి.
ఈ నెల 5న జరిగిన చాప్టర్ వార్షిక సమావేశంలో ఈ ఎన్నిక జరిగినట్లు సిఐఐ వర్గాలు వెల్లడించాయి. చంద్రశేఖర్ 2003 నుంచి దేశ వ్యాప్తంగా జెజిఐ కె-12 స్కూల్స్‌ను స్థాపించి, వాటిని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక, నేర్పే విధానం, బోధనాభివృద్ధి కార్యక్రమాలను అందించడంలో ఆయన అత్యుత్తమ ప్రతిభ కలిగి ఉన్నారని సదరు వర్గాలు ఆదివారం తెలియజేశాయ.
కాగా, సందీప్ రాఠి ప్రస్తుతం బిఎన్‌ఆర్ ఉద్యోగ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఎఫ్‌ఓగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. రాఠీ వైఐలో చాలా చురుకైన సభ్యుడిగా చాలా కాలంగా పని చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్శిటీలో రాఠీ మాస్టర్ బిజినెస్ సిస్టమ్స్ పూర్తి చేశారు.