బిజినెస్

మదుపరుల సంపదలో రూ. 14 లక్షల కోట్లు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జాతీయ, అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుంటే.. మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరవుతోంది. గడచిన ఏడాది కాలంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థలు కోల్పోయినది దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు. ఇంకా కచ్ఛితంగా చెప్పాలంటే ఆయా సంస్థల షేర్లలో పెట్టుబడులు పెట్టిన మదుపరులు నెలకు లక్ష కోట్ల రూపాయలపైనే నష్టపోయారు. గత ఏడాది మార్చి 4న బిఎస్‌ఇ సూచీ సెనె్సక్స్ 30,024.74 వద్ద ఉంటే, ప్రస్తుతం 24,646 వద్ద ఉంది. అంటే సరిగ్గా ఈ ఏడాది కాలంలో సెనె్సక్స్ 5,378 పాయింట్లు క్షీణించింది. దీంతో మదుపరుల సంపద 13.82 లక్షల కోట్ల రూపాయలు దిగజారింది. ఫలితంగా బిఎస్‌ఇ సంస్థల మార్కెట్ విలువ 100 లక్షల కోట్ల రూపాయల మార్కుకు దిగువన 91.56 లక్షల కోట్ల రూపాయల వద్దకు పడిపోయింది. ఈ ఏడాది కాలంలో సెనె్సక్స్ గరిష్ఠ స్థాయి 30,024.74 పాయింట్లయితే, కనిష్ట స్థాయి ఈ ఏడాది ఫిబ్రవరి 29న నమోదైన 22,494.61 పాయింట్లు. అంతర్జాతీయ మార్కెట్ల కదలికలు, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు, చైనా జిడిపి వృద్ధిరేటు పతనం, విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడుల ఉపసంహరణలతోపాటు దేశీయంగా ఆర్థిక సంస్కరణల అమలులో నెలకొన్న ప్రతిష్ఠంభన, ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ సంస్థల బలహీన ఆర్థిక ఫలితాలు తదితర అంశాలు భారతీయ స్టాక్ మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఎఫ్‌పిఐలు తెచ్చే పెట్టుబడులపైనే దేశీయ స్టాక్ మార్కెట్ల పరుగులు ఆధారపడి ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే ఈ నెల మినహా గత రెండు నెలల్లో ఎఫ్‌పిఐలు 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత ఏడాది మొత్తం కూడా కేవలం 18,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోనే ఎఫ్‌పిఐలు సరిపెట్టారు. కాగా, అంతర్జాతీయ ఆందోళనలతోపాటు అమల్లోకి రాలేకపోతున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర కీలక ఆర్థిక బిల్లులతోపాటు ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత నెల 11న సెనె్సక్స్ ఏకంగా 807 పాయింట్లు పతనమైనది తెలిసిందే. మదుపరులలో నెలకొన్న భయాలే దీనికి నిదర్శనమని విశే్లషిస్తున్నారు. సెనె్సక్స్‌లో బిహెచ్‌ఇఎల్ సంస్థ విలువ 60 శాతం పడిపోగా, టాటా మోటార్స్ విలువ 40 శాతం, ఎస్‌బిఐ 36 శాతం చొప్పున దిగజారింది.