బిజినెస్

ఇక నిరవధిక సమ్మే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఆభరణాల వర్తకులు దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెను నిరవధికంగా జరపాలని నిర్ణయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గత నెల 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో వెండియేతర నగలపై ఎక్సైజ్ సుంకాన్ని 1 శాతం విధించాలని ప్రతిపాదించారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 2 నుంచి సమ్మెబాట పట్టిన జ్యుయెలర్లు.. ఇకపై నిరవధికంగా జరపాలని సోమవారం నిర్ణయించుకున్నారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామంటూ ఇప్పటికే కేంద్ర హామీ ఇవ్వగా, దీన్ని నగల వ్యాపారులు ఏమాత్రం విశ్వసించడం లేదు. అరుణ్ జైట్లీతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా జ్యుయెలర్లు కలిసి తమ డిమాండ్లను వివరించారు. ఈ క్రమంలో 12 కోట్ల రూపాయలకు మించిన టర్నోవర్‌ను కలిగిన జ్యుయెలర్లకే వెండి మినహా ఆభరణాల అమ్మకాలపై ఎక్సైజ్ పన్నును 1 శాతం విధిస్తామనగా, దాన్ని వర్తకులు అంగీకరించడం లేదు. ‘అఖిల భారత రత్నాలు, ఆభరణాల సమాఖ్య (జిజెఎఫ్) అనుబంధంగా ఉన్న 358 సంఘాలను మేము కలిశాం. ఈ సంఘాల్లో 3 లక్షలకుపైగా స్వర్ణకారులు, రిటైలర్లు, డిజైనర్లు తదితర రంగాల కార్మికులున్నారు. వీరందరూ కూడా ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చేంతవరకు సమ్మెను నిరవధికంగా ముందుకు తీసుకెళ్ళాలని నిర్ణయించారు.’ అని జిజెఎఫ్ చైర్మన్ శ్రీధర్ సోమవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. కాగా, 2 లక్షల రూపాయలు, అంతకంటే ఎక్కువ కొనుగోళ్లకు తప్పనిసరిగా పాన్ కార్డు వివరాలను వెల్లడించాలన్న నిబంధననూ జ్యుయెలర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు గత ఆరు రోజులుగా చేసిన సమ్మెతో పరిశ్రమ 10,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని కోల్పోయింది.
10న వాణిజ్య సంఘాల నిరసన
న్యూఢిల్లీ: మరోవైపు పిఎఫ్, కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వ ధోరణిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ నెల 10న నిరసన తెలపనున్నట్లు అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గురుదాస్ దాస్‌గుప్తా పిటిఐకి తెలిపారు.