బిజినెస్

సెనె్సక్స్‌కు స్వల్ప లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గత వారం నాలుగేళ్ల గరిష్ఠ స్థాయి లాభాలను సూచీలు అందుకున్నది తెలిసిందే. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 12.75 పాయింట్లు పెరిగి 24,659.23 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ అతి స్వల్పంగా 0.05 పాయింట్లు తగ్గి 7,485.30 వద్ద నిలిచింది. శుక్రవారం నిఫ్టీ 7,485.35 వద్ద స్థిరపడింది.
నిజానికి ఉదయం సెనె్సక్స్ 64 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల లాభాలతో మొదలయ్యాయి. అయితే మదుపరులు లాభాల స్వీకరణ వైపు నడిచారు. దీంతో సూచీలు పడుతూ, లేస్తూ పయనం సాగించాల్సి వచ్చింది. ఇకపోతే బిఎస్‌ఇలోని మెటల్, చమురు, గ్యాస్, రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 1.70 శాతం నుంచి 0.20 శాతం వరకు పెరిగాయి.
స్మాల్-క్యాప్ సూచీ 0.24 శాతం పెరిగితే, మిడ్-క్యాప్ సూచీ 0.25 శాతం పడిపోయింది. మరోవైపు ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు నష్టపోగా, ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడాయి. సోమవారం శివరాత్రి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లు మూతపడినది తెలిసిందే. కాగా, గత వారం సెనె్సక్స్ 1,492.18 పాయింట్లు, నిఫ్టీ 455.60 పాయింట్లు పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) 671.57 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు.
బాండ్ల వేలానికి విశేష స్పందన
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మంగళవారం విదేశీ మదుపరుల కోసం నిర్వహించిన ప్రభుత్వ బాండ్ల వేలానికి విశేష స్పందన లభించింది. 4,681 కోట్ల రూపాయల విలువైన బాండ్లను వేలానికి పెడితే, 6,463 కోట్ల రూపాయల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలాన్ని ఎన్‌ఎస్‌ఇ నిర్వహించింది.
బిఎస్‌ఇ చైర్మన్‌గా సుధాకర్ రావు
న్యూఢిల్లీ: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ చైర్మన్‌గా సుధాకర్ రావు బాధ్యతలు చేపడుతున్నారు. బిఎస్‌ఇ చైర్మన్‌గా ఎస్ రామదొరై సోమవారం పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలోకి పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్ సుధాకర్ రావు వస్తున్నారని మంగళవారం బిఎస్‌ఇ తెలిపింది. దేశీయ ఐటిరంగ దిగ్గజం టిసిఎస్ మాజీ చీఫ్ అయిన రామదొరై 2010 మార్చిలో బిఎస్‌ఇ చైర్మన్‌గా బాధ్యతల్లోకి వచ్చారు.

రివైటల్ హెచ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ

న్యూఢిల్లీ, మార్చి 8: సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్.. తమ రివైటల్ హెచ్ ఉత్పాదనకు కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్ ధోనీని నియమించుకుంది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో సన్ ఫార్మా తెలియజేసింది. ‘రివైటల్ హెచ్ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా భారత క్రికెట్ జట్టు సారథి ఎమ్‌ఎస్ ధోనీని సన్ ఫార్మా గ్లోబల్ కన్జ్యూమర్ హెల్త్‌కేర్ బిజినెస్ మంగళవారం ప్రకటించింది.’ అని వెల్లడించింది. కాగా, ఉత్తర, మధ్య, తూర్పు భారతావనిలో రివైటల్‌కు మంచి మార్కెట్ ఉండగా, పశ్చిమ, దక్షిణ భారతంలోనూ డిమాండ్‌ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామని సన్ ఫార్మా తెలిపింది. ఇందుకు ధోనీ ప్రచారం ఉపకరిస్తుందని అభిప్రాయపడింది.