బిజినెస్

తెలంగాణలో సుజ్లాన్ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం లో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో సుజ్లాన్ గ్రూప్ 3 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబర్చింది. ముంబయిలో ఒక రోజు పర్యటనలో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్.. సుజ్లాన్ గ్రూప్ సిఎండి తులసి తంతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు తులసి తంతి అంగీకరించారని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటన తెలిపింది.
కాగా, ముంబయిలో విసి సర్కిల్ సదస్సులో పాల్గొన్న మంత్రి కెటిఆర్, ఈ సమావేశానికి హాజరైన పలువురు పారిశ్రామిక వేత్తలనూ కలిశారు. ఈ క్రమంలోనే మహీంద్ర గ్రూప్ సిఎండి ఆనంద్ మహీంద్ర, కొటక్ గ్రూప్ ఎండి ఉదయ్ కోటక్‌లతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించగా, వారు సానుకూ లంగా స్పందించినట్లు ప్రకటన పేర్కొంది. కాగా, సదస్సు లో పాల్గొన్న కెటిఆర్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కొత్త రాష్ట్రం తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించారు. త్వరలోనే టి ఫండ్‌ని ఏర్పాటు చేయబోతున్నామని, అంతర్జాతీయ స్థాయలో విజయాలు సాధించిన పలు సంస్థలు, వ్యక్తులు దీనిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. టి ఫండ్ సుమారు రూ. 125 కోట్లతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రితో పాటు పరిశ్రమల శాఖ, ఐటి శాఖ కార్యదర్శులు అరవింద్ కుమార్, జయేష్ రంజన్‌లు కూడా సదస్సులో పాల్గొన్నారు.

మహీంద్ర గ్రూప్ సిఎండి ఆనంద్ మహీంద్రతో కెటిఆర్. చిత్రంలో పరిశ్రమల శాఖ, ఐటి శాఖ కార్యదర్శులు
అరవింద్ కుమార్, జయేష్ రంజన్ కూడా ఉన్నారు