బిజినెస్

నేడు, రేపు గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు రెండు రోజుల పాటు సమ్మెకు దిగుతున్నారు. ఈ నెల 10, 11 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చినట్లు ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అధికారుల జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరెడ్డి తెలియజేశారు. బుధవారం హైదరా బాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగానికి తీవ్ర విఘాతంగా ఉన్న 2015 ఆర్‌ఆర్‌బి సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెకు పిలుపునిచ్చినట్లు వెల్లడించారు. ఇంతేకాకుండా బ్యాంకుల్లో ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ, ఉద్యోగుల ధీర్ఘకాలిక సమ్యలను పరిష్కరించాలని కోరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని అన్ని బ్యాంకుల ఉద్యోగులను, ప్రజలను ఆయన కోరారు.

పోలవరానికి నిధులెన్ని?

రాజమహేంద్రవరం, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవన రేఖగా, బలమైన సెంటిమెంట్‌గా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సాధారణ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయిస్తుందోనన్న అంశంపైనే అందరి దృష్టి ఉంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించటం వల్ల మొత్తం భారాన్ని, బాధ్యతలను కేంద్ర ప్రభుత్వమే మోయాల్సి ఉన్నప్పటికీ, ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ఖర్చును ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను చంద్రబాబు సర్కారు గురువారం అసెంబ్లీలో ప్రకటిస్తున్న బడ్జెట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

7,500 స్థాయికి నిఫ్ట్పీ
135 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్

ముంబయి, మార్చి 9: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న విశ్వాసం మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. వరుసగా ఆరో రోజు లాభాలను కొనసాగిస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 134.73 పాయింట్లు పుంజుకుని 24,793.96 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 46.50 పాయింట్లు లాభపడి 7,500 స్థాయి ఎగువన 7,531.80 వద్ద నిలిచింది. ముఖ్యంగా దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి షేర్ల విలువ గణనీయంగా పెరిగింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విటారా బ్రీజా మోడల్‌ను మారుతి ఆవిష్కరించిన నేపథ్యంలో సంస్థ షేర్ల విలువ 4 శాతం ఎగబాకింది. సెనె్సక్స్‌లో 3,603.90 వద్ద ముగియగా, నిఫ్టీలో 3,576.40 వద్ద నిలిచింది. మార్కెట్ విలువ ఈ ఒక్కరోజే 4,182.82 కోట్ల రూపాయలు ఎగబాకి 1,08,748.82 కోట్ల రూపాయలకు చేరుకుంది. కాగా, ఈ జోష్‌కు కారణమైన బ్రీజా ధర ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం రూ. 6.99 లక్షల నుంచి 9.68 లక్షలుగా ఉంది. ఇకపోతే క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, విద్యుత్ రంగాల షేర్ల విలువ 1.63 శాతం నుంచి 1.42 శాతం మేర నష్టపోగా, ఆటో రంగ షేర్ల విలువ మాత్రం 1.25 శాతం పెరిగింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.94 శాతం, స్మాల్-క్యాప్ 0.04 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. చైనా వాణిజ్య గణాంకాలు పేలవంగా నమోదవడంతో ఆ ప్రభావం ప్రపంచ వృద్ధిపై పడుతుందన్న ఆందోళనలు మదుపరులలో వ్యాపించాయి. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు క్షీణించగా, ఈ క్రమంలో ఆసియా మార్కెట్లూ పతనమయ్యాయి. హాంకాంగ్, జపాన్ తదితర దేశాల సూచీలు 1.34 శాతం నుంచి 0.84 శాతం వరకు దిగజారాయి. ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఉద్దీపనలపై మదుపరులలో నెలకొన్న ఊహాగానాల మధ్య సూచీలు లాభాలను అందుకోలేకపోయాయి.

ఏపి విద్యుత్ సంస్థలకు ప్రతిష్ఠాత్మక అవార్డు

హైదరాబాద్, మార్చి 9: సంప్రదాయేతర ఇంధన వనరులు, జల విద్యుత్ రంగంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మకమైన ఇంధన భద్రతలో బెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా అవార్డును ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు పొందాయి. రెండవ సంప్రదాయేతర ప్రమోషన్ అసోసియేషన్ ఈ అవార్డును ప్రకటించింది. నాలుగు వేల మెగావాట్ల జల విద్యుత్, 14 గిగావాట్ల సంప్రదాయేతర ఇంధన వనరులను ఏపి విద్యుత్ సంస్థలు అభివృద్ధి చేశాయి. ఈ అవార్డును ఏపి ఇందన వనరుల ఢిల్లీ ప్రతినిధి బాబర్‌కు ఎంపి ఆర్‌కె జెనా ఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో అందచేశారు.