బిజినెస్

వెంకయ్య నాయుడుకు ‘స్కాచ్’ జీవితకాల సాఫల్య అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్కాచ్ ఫౌండేషన్ 43వ సమ్మిట్‌లో భాగంగా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఆందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి ఈ అవార్డును వెంకయ్య నాయుడు, ఆయన సతీమణి ఉషమ్మలకు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత ప్రచారక్‌లు సోంపల్లి సోమయ్య, దుర్గాప్రసాద్ తనకు గురువులని, వారే తన గమ్యాన్ని మార్చారని చెప్పారు. వారివల్లనే ఇప్పుడున్న వ్యక్తిత్వం, సమర్ధత వచ్చాయన్న ఆయన వారే తనకు క్రమ శిక్షణ, నిబద్ధత నేర్పించారని పేర్కొన్నారు. చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, తన కొడుకు, కూతురు రాజకీయ ప్రవేశం గురించి తనను ప్రశ్నిస్తుంటారని, అయతే తాను జీవించి ఉన్నంతకాలం వారు రాజకీయాల్లోకి రారని వెంకయ్య స్పష్టం చేశారు. అరుణ్ జైట్లీ మాట్లాడుతూ వెంకయ్య నాయుడిది గొప్ప మనస్సని అన్నారు. ఆయన ఎప్పటినుంచో తెలుసునని, నాలుగున్నర దశాబ్దాలుగా కలసి పని చేస్తున్నామన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఆయన కలసిపోతు సులభంగా పని చేస్తారని కొనియాడారు.

చిత్రం కుటుంబ సభ్యుల మధ్య జీవితకాల సాఫల్య పురస్కారంతో వెంకయ్య

సజ్జన్ చేతికి నవీన్ ప్లాంట్?
న్యూఢిల్లీ, మార్చి 18: సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ.. నవీన్ జిందాల్ సారథ్యంలోని జిందాల్ పవర్ లిమిటెడ్‌కు చెందిన 1,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5,500 కోట్ల రూపాయల నుంచి 5,800 కోట్ల రూపాయల మధ్య ఈ ప్లాంట్‌ను కొనుగోలు చేసే వీలుందని తెలుస్తుండగా, ఈ నెలాఖర్లో లేదా వచ్చే నెల డీల్ కుదరవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఈ 1,000 మెగావాట్ల ప్లాంట్ ఉంది.
‘ప్రత్యామ్నాయ పన్నుకు సిద్ధం’
ముంబయి, మార్చి 18: ప్రత్యామ్నాయ పన్నుకు తాము సిద్ధమని ఆభరణాల వర్తకులు శుక్రవారం ప్రకటించారు. బంగారు ఆభరణాలపై 1 శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధించాలని కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నగల వ్యాపారులు బంద్ నిర్వహిస్తున్నది తెలిసిందే. ఈ బంద్ శుక్రవారానికి 17వ రోజుకు చేరగా, 1 శాతం ఎక్సైజ్ పన్నుపై ప్రభుత్వం వెనక్కి తగ్గేదాకా, తమ నిరవధిక బంద్ కొనసాగుతుందని, అయితే ఇతర మార్గాల ద్వారా ప్రత్యామ్నాయంగా పన్ను చెల్లించేందుకు సిద్ధమని జిజెఎఫ్ డైరెక్టర్ అశోక్ మల్హోత్రా విలేఖరులకు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో 16 లక్షల మొబైల్ కనెక్షన్లు లక్ష్యం
బిఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ మురళీధర్

ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, మార్చి 18: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 16 లక్షల మొబైల్ కనెక్షన్లు లక్ష్యంగా నిర్ణయించామని, దానిని రానున్న రెండు నెలల్లో అధిగమించే అవకాశం ఉందని బిఎస్‌ఎన్‌ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ పివి మురళీధర్ తెలిపారు. గుంటూరు ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిజిఎం మురళీధర్ వివరాలు అందజేశారు. గతంలో కంటే ల్యాండ్ లైన్ కనెక్షన్లు 1 శాతం, బ్రాడ్‌బ్యాండ్ సేవలు 5 శాతం పెరిగాయన్నారు. తద్వారా సంస్థకు వస్తున్న రెవిన్యూ కూడా సంతృప్తికరంగా ఉందన్నారు.
హోలి, ఈస్టర్ పండుగలను పురస్కరించుకుని వినియోగదారులకు ఉచితంగా సిమ్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. టాప్ అప్ ఫుల్‌టాక్ టైం వర్తింపు చేస్తున్నామన్నారు. కాగా, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సెల్ టవర్‌లను ఆధునికరిస్తున్నట్లు తెలిపారు. సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి వృత్తి నైపుణ్యం మెరుగుపరచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు.
కాల్ డ్రాప్ సమస్యలు ప్రస్తుతం అన్నీ మొబైల్ సంస్థల వినియోగదారులు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. విలేఖరుల సమావేశంలో జనరల్ మేనేజర్ కెవి చౌదరి, డిజిఎం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

25 సంస్థల్లో పది భారత్‌వే

ఆసియాలో పనిచేయడానికి అత్యంత అనువైన సంస్థల జాబితా విడుదల

న్యూఢిల్లీ, మార్చి 18: ఆసియా దేశాల్లో పనిచేయడానికి అత్యంత అనువుగా ఉన్న సంస్థల జాబితాలో 10 భారతీయ సంస్థలకు చోటు దక్కింది. ఈ విభాగంలో మొత్తం 25 అత్యుత్తమ సంస్థలతో జాబితా రూపొందగా, ఇందులో డిహెచ్‌ఎల్, గూగుల్, మారియట్ తదితర బహుళజాతి సంస్థల మధ్య భారత్‌కు చెందిన లుపిన్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, మహీంద్ర అండ్ మహీంద్ర ఆటోమోటివ్ ఫార్మ్ ఎక్విప్‌మెంట్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్‌ఎమ్‌ఎస్‌ఐ ప్రైవేట్ లిమిటెడ్, ఫోర్బ్స్ మార్షల్, లైఫ్‌స్టైల్ ఇంటర్నేషనల్, బజాజ్ ఫైనాన్స్, సిల్వర్ పార్క్ అప్పారెల్, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలున్నాయి. బహుళజాతి సంస్థల్లో ఓమ్నికామ్, ఈఎమ్‌సి, నెట్‌యాప్, హయత్, మార్స్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, సాప్ సంస్థలూ ఉన్నాయి. ఆసియాలోని 9 దేశాల్లోగల 900లకుపైగా సంస్థలకు చెందిన 2 లక్షలకుపైగా ఉద్యోగులు ఈ సర్వేలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, ఆసియా-పసిఫిక్ దేశాల్లో పనిచేయడానికి అనువైన అత్యుత్తమ సంస్థలకు సంబంధించి విడుదలైన ఈ రెండో వార్షిక జాబితా ప్రకారం బహుళజాతి సంస్థల్లో డిహెచ్‌ఎల్‌కు అత్యధికులు తమ ఓటును వేయగా, చిన్న, మధ్యతరగతి సంస్థల్లో సేల్స్‌ఫోర్స్, భారీ సంస్థల్లో అట్లాస్సియాన్‌కు పెద్ద సంఖ్యలో మద్దతు పలికారు.