బిజినెస్

ఈ-వేలంలో జిఎమ్‌ఆర్, ల్యాంకో, జివికె ప్లాంట్లకు గ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ-వేలంలో దభోల్, జిఎమ్‌ఆర్, ల్యాంకో తదితర తొమ్మిది పవర్ ప్లాంట్లు ఆదివారం విజయవంతంగా 7.62 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎమ్‌ఎమ్‌ఎస్‌సిఎమ్‌డి) రీగ్యాసిఫైడ్ లిక్విడ్ నాచురల్ గ్యాస్ (ఆర్-ఎల్‌ఎన్‌జి)ను గెలుచుకున్నాయి. ఈ గ్యాస్‌తో ఈ తొమ్మిది ప్లాంట్లు ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మొత్తం 6.79 బిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేయనున్నాయి. యూనిట్‌కు 4.70 రూపాయల చొప్పున ఈ విద్యుత్‌ను రాబోయే ఆరు నెలల్లో డిస్కమ్‌లకు ప్లాంట్లు విక్రయిస్తాయి. దీనివల్ల ప్రభుత్వానికి 18.29 కోట్ల రూపాయలు ఆదా అవుతుందని అంచనా. ఇది ప్రభుత్వ విద్యుత్ వ్యవస్థ అభివృద్ధి నిధి (పిఎస్‌డిఎఫ్)కి కలిసి రానుంది. కాగా, ఈ-వేలంలో గ్యాస్‌ను దక్కించుకున్న సంస్థల్లో అత్యధికంగా రత్నగిరి గ్యాస్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ (దభోల్) 2.35 ఎమ్‌ఎమ్‌ఎస్‌సిఎమ్‌డి పొందగా, ఆ తర్వాత ల్యాంకో కొండపల్లి పవర్ 1.58, జిఎమ్‌ఆర్ రాజమండ్రి ఎనర్జీ 1.09, కోనసీమ గ్యాస్ పవర్ 0.71, పయనీర్ గ్యాస్ పవర్ 0.55, జిఎమ్‌ఆర్ వేమగిరి పవర్ జనరేషన్ 0.52, గామా ఇన్‌ఫ్రాప్రాప్ ప్రైవేట్ లిమిటెడ్ 0.35, జివికె ఇండస్ట్రీస్ 0.32, స్రవంతి ఎనర్జీ 0.25 ఎమ్‌ఎమ్‌ఎస్‌సిఎమ్‌డి చొప్పున అందుకున్నాయి. 5,942 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఈ గ్యాస్ అవసరమవనుంది. ఇక ఈ-వేలం ఆదివారం విజయవంతంగా ముగిసినట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, పిఎస్‌డిఎఫ్ పథకం క్రిందే ఈ గ్యాస్‌ను తొమ్మిది సంస్థలు తమ స్టాండర్డ్ పవర్ ప్రాజెక్టుల (ఎస్‌పిజి) నిర్వహణ కోసం దిగుమతి చేసుకోనున్నాయ. పిఎస్‌డిఎఫ్ పథకంలో భాగంగా గ్యాస్‌ను కొనుగోలు చేసి దిగుమతి చేసుకోవడానికి ఎస్‌పిజిలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది.