బిజినెస్

మాల్యా వ్యవహారంపై కూపీ లాగుతున్న సెబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా వ్యవహారంపై విచారణను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మరింత లోతుగా జరుపుతోంది. మాల్యా నేతృత్వంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యుబి) గ్రూప్ లావాదేవీలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ తదితర అంశాలను దగ్గరగా గమనిస్తోంది. యుబి గ్రూప్‌తో వ్యాపార సంబంధాలున్న బ్రిటన్‌కు చెందిన లిక్కర్ దిగ్గజం డియాజియో, ఇతర విదేశీ వాటాదారుల లావాదేవీలనూ సెబీ విచారిస్తోంది. మాల్యాకు తన గ్రూప్‌లోని వివిధ సంస్థల్లో ఉన్న వాటాలు, ఆయన జరుపుతున్న వాటాల అమ్మకాలు తదితర వివరాలన్నింటినీ కూడా సెబీ తెలుసుకుంటోంది. ఇందులోభాగంగానే దేశ, విదేశాల్లోని ఇతర రెగ్యులేటర్ల నుంచి సమాచారం కోరాలనుకుంటోంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచీ వివరాలను సేకరించాలని భావిస్తున్నట్లు సెబీ అధికారి ఒకరు తెలిపారు. మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే. తీవ్ర రుణ సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. ప్రస్తుతం విమానయాన సేవలకు దూరమవగా, ఉద్యోగులకు వేతనాలు కూడా చెల్లించలేకపోయింది. ఉద్యోగులు సైతం తమ జీతాల కోసం ఆందోళనలు చేస్తుండగా, తీసుకున్న రుణాలను ఉద్దేశపూర్వకంగానే చెల్లించడం లేదంటూ ఎస్‌బిఐసహా పలు బ్యాంకులు మాల్యాను విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటించాయి. ఈ వ్యవహారం కోర్టులకు వెళ్లగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తోపాటు సిబిఐ, ఎస్‌ఎఫ్‌ఐఒ తదితర అన్ని దర్యాప్తు సంస్థలు విచారణలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మాల్యాను.. వచ్చే నెల 2న ఇక్కడ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదేశించగా, ప్రభుత్వరంగ బ్యాంకిం గ్ సంస్థ ఐడిబిఐ నుంచి తీసుకున్న 900 కోట్ల రూపాయలకుపైగా రుణం వ్యవహారంలో నమోదైన కేసులో భాగంగా మనీలాండరింగ్ విచారణకు రావాలని మాల్యాకు ఈడీ తాజా సమన్లలో స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సెబీ కూడా మరింతగా పట్టు బిగిస్తుండగా, కింగ్ ఆఫ్ గుడ్‌టైమ్స్ కు బ్యాడ్‌టైమ్స్ పెరిగినట్లైంది.

నెలాఖర్లో ఆస్ట్రేలియాకు జైట్లీ

ముంబయి, మార్చి 20: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ నెలాఖర్లో ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. 29న సిడ్నీలోని ఎస్‌పి జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ వద్ద జరిగే కార్యక్రమంలో ఆయన ప్రసగించనున్నారు. భారత హైకమిషన్, కాన్సులేట్‌తో కలిసి ఈ బిజినెస్ స్కూల్ పనిచేస్తుండగా, దీనికి సిడ్నీతోపాటు దుబాయ్, ముంబయి, సింగపూర్‌లలో క్యాంపస్‌లున్నాయి. కాగా, జైట్లీతోపాటు పారిశ్రామిక సంఘం సిఐఐకి చెందిన ఓ అత్యున్నతస్థాయి వ్యాపార బృందం కూడా ఆస్ట్రేలియాకు వెళ్తోంది. సిఐఐతోపాటు ఇవై, ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా ఉన్నాయి