బిజినెస్

తరలిపోతున్న పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: అనంతపురం జిల్లా నుంచి పరిశ్రమ లు తరలిపోతున్నాయ. కరవు జిల్లా.. నాలుగు పరిశ్రమలు వస్తే జనానికి ఉపాధి దొరుకుతుందనుకుంటే శ్రుతి మించుతున్న రాజకీయ జోక్యం దాన్ని కాస్తా దూరం చేస్తోంది. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు అండగా నిలవాల్సిన కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే అడ్డం పడుతున్నారు. వాటాలు, మామూళ్ల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తూ, బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో రావాల్సిన పరిశ్రమలు కూడా వెనక్కు మళ్లుతున్నాయి. అనంతపురం జిల్లా వాతావరణానికి అనువైన పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ఔత్సాహికులు.. ఒకపక్క అధికారుల తీరు, మరోపక్క వాటాల కోసం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో వెనక్కిపోతున్నారు. జిల్లాలో సోలార్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నా యి. దీంతో చాలా ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఔత్సాహికులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఐదు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఒప్పందాలు జరిగాయి. దీంతోపాటు గాలిమరల ద్వారా మరో 4,427 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయడానికి ఒప్పందాలు జరిగాయి. అయితే క్షేత్రస్థాయిలో అధికారుల తీరు, అదే సమయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల బెదిరింపులతో ఔత్సాహికులు బెదిరిపోతున్నారు. జిల్లాలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలను ఒకసారి పరిశీలిస్తే.. ధర్మవరం మండలం గరుడంపల్లి వద్ద 20 మెగావాట్ల సామర్థ్యంతో ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దీనిని రూ. 210 కోట్ల ఖర్చుతో 300 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు సంబంధించి భూమిని సేకరించి 300 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి నిర్మాణ సామగ్రి, కూలీలకు అవసరమైన షెడ్లు తదితర, నిర్మాణాలను సైతం చేపట్టారు. అనంతరం అక్కడికి కావాల్సిన అన్ని రకాల సామగ్రిని, పరికరాలను తీసుకుని వచ్చి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇలా అక్కడ పనులు జరుగుతూ ఉండగా జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి తనకు మామూలు కింద 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని హెచ్చరిక జారీ చేశాడు. దీంతో ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులు తాము అంత ఇచ్చుకోలేమని, అక్కడ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల స్థానికంగా పలువురికి ఉపాధి దొరకుతుందని ఒప్పించే యత్నం చేశారు. అప్పటికీ ఆ ప్రజాప్రతినిధి ఒప్పుకోకపోవడంతో చివరకు మూడు కోట్ల రూపాయల వరకూ ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ, సదరు ప్రజాప్రతినిధి మాత్రం రూ.10 కోట్లు ఇవ్వాల్సిందేనని మొండికేసినట్టు తెలిసింది. దీంతో వారు చేసేది లేక అక్కడ ప్లాంటు నిర్మాణ యోచన విరమించుకుని, నిర్మాణ పనుల కోసం తీసుకుని వచ్చిన మొత్తం సామగ్రిని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు తరలించారు. అప్పటికే అక్కడ చేపట్టిన చిన్న చిన్న నిర్మాణాలను, ఫెన్సింగ్‌ను సైతం తొలగించి ఎమ్మిగనూరులో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసుకోవడానికి వెళ్లిపోయారు. దీంతోపాటు ముదిగుబ్బ మండలంలో నిర్మాణంలో ఉన్న సోలార్ పవర్ ప్రాజెక్టుకు సైతం అదే ప్రజా ప్రతినిధి అడ్డుతగిలినట్టు తెలిసింది. అక్కడ ఏర్పాటు చేసిన పవర్ ప్రాజెక్టులో రాష్ట్ర క్యాబినెట్‌లో కీలకశాఖ నిర్వహిస్తున్న మంత్రికి భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసినా ఏ మాత్రం ఖాతరు చేయకుండా మామూళ్ల బేరం పెట్టాడు. చివరికి సంస్థ యాజమాన్యం సుమారుగా 10 కోట్ల రూపాయలు ముట్టచెప్పేందుకు యాజమాన్యం అంగీకరించడంతో నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. వీటితోపాటు తాడిపత్రి నియోజకవర్గంలో సైతం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకున్నట్లు ప్రచారంలో ఉంది. అక్కడ 300 ఎకరాల్లో పరిశ్రమ స్థాపించేందుకు ఒక సంస్థ ముందుకు వచ్చింది. ఈ 300 ఎకరాలను అప్పగించే బాధ్యత తీసుకున్న ఒక ప్రజాప్రతినిధి సుమారు 150 ఎకరాలను సంస్థకు కారు చౌక ధరకు అప్పగించి తన ఆధీనంలో ఉన్న మరో 150 ఎకరాలను అత్యధిక మొత్తానికి కట్టబెట్టినట్టు తెలిసింది. ఆ 150 ఎకరాలు సైతం రైతుల వద్ద నుంచి అతి తక్కువ ధరకు కొన్న సదరు ప్రజాప్రతినిధి ఎక్కువ ధరకు ఆ సంస్థకు అంటకట్టినట్టు సమాచారం. దీంతో అతి తక్కువ ధరతో భూమి సేకరించి సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలనుకున్న సంస్థ యాజమాన్యానికి కళ్లు తిరిగిపోయాయి. ఒక దశలో యాజమాన్యం ప్రాజెక్టును వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డట్లు సమాచారం. కానీ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. జిల్లాలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న విండ్ పవర్ ప్రాజెక్టుల్లో సైతం అధికార పార్టీ నాయకులు మామూళ్లు దండుకుంటున్నట్టు సమాచారం. ప్రతి టవర్‌కు కొంత మొత్తం ఇచ్చేలా వీరు ముందుగానే సంస్థ యాజమాన్యంతో ఒప్పం దం చేసుకున్న తరువాతనే పనులు మొదలు పెట్టడానికి ఒప్పుకుంటున్నట్టు ప్రచారంలో ఉంది. ఇలా ఇవ్వలేని పక్షంలో స్థానికంగా ప్రజలను కూడగట్టి నిరసనలతో పనులు జరగకుండా అడ్డుకుంటున్నారు. ఇలా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు కావాల్సిన వివిధ పరిశ్రమలు అధికార పార్టీ నాయకుల కోరికలను తీర్చలేక వెనక్కి వెళ్లిపోతున్నాయి.