బిజినెస్

విదేశీ పెట్టుబడులపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ప్రధానంగా విదేశీ పెట్టుబడులపై ఆధారపడి నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష ప్రభావం కూడా ట్రేడింగ్‌పై కనిపిస్తుందని పేర్కొంటున్నారు. ఫిబ్రవరి నెలకుగాను విడుదలైన వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు అదుపులోకి రావడం కీలక వడ్డీరేట్ల తగ్గింపునకు ఆర్‌బిఐపై ఒత్తిడి తెస్తోందని చెబుతున్నారు. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్టాన్ని తాకుతూ 5.69 శాతం నుంచి 5.18 శాతానికి దిగివస్తే, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం వరుసగా 16వ నెల మైనస్‌కే పరిమితమై (-)0.91 శాతంగా నమోదైంది. దీంతో ఆర్‌బిఐ రాబోయే ద్రవ్యసమీక్షలో తప్పకుండా వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు మార్కెట్ వ్యాప్తంగా పెరిగాయి. పారిశ్రామికోత్పత్తి (ఐఐపి) కూడా పడిపోవడం రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్ల తగ్గింపునకు కలిసొస్తుందని మదుపరులు భావిస్తున్నారు. దీంతో గత మూడు వారాలుగా లాభాల్లో నడుస్తున్న మార్కెట్‌కు ఈ వారం కూడా కొనుగోళ్ల మద్దతు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్‌బిఐ వచ్చే నెల 5న ద్రవ్యసమీక్ష చేయనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఇదే తొలి ద్రవ్యసమీక్ష. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఈ సంవత్సరం వడ్డీరేట్ల పెంపు అంతగా ఉండకపోవచ్చంటూ వేసిన అంచనా గత వారం విదేశీ మదుపరులను పెట్టుబడుల వైపునకు నడిపించినది తెలిసిందే. నిజానికి అంతకుముందు రెండు వారాల్లోనూ విదేశీ పోర్ట్ఫోలియో, సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ,ఎఫ్‌ఐఐ) భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. అయతే గత వారం ఫెడ్ రిజర్వ్ అంచనా విదేశీ మదుపరులకు కొత్త ఉత్సాహాన్నివ్వగా, ఆ ప్రభావం ఈ వారం కూడా ఉంటుందని విశే్లషకులు చెబుతున్నారు. ఇకపోతే అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలు కూడా ఈ వారం మార్కెట్లను శాసిస్తాయని విశే్లషకులు అంటున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 234.75 పాయింట్లు పుంజుకుని 24,952.74 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 94.15 పాయింట్లు అందుకుని 7,604.35 వద్ద స్థిరపడినది తెలిసిందే. మొత్తానికి ప్రస్తుతం సెనె్సక్స్ 25 వేల స్థాయకి కూతవేటు దూరంలో నిలవగా, నిఫ్టీ 7,600 మార్కుపైన కదలాడు తోంది. ఇక గత మూడు వారాల్లో సెనె్సక్స్ 1,798.44 పాయింట్లు వృద్ధి చెందితే, నిఫ్టీ 574.60 పాయింట్లు ఎగిసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గణాంకాల ప్రకారం విదేశీ మదుపరులు గడచిన వారం 4,580.37 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్లలోకి తెచ్చారు. బిఎస్‌ఇ టర్నోవర్ 14,255.83 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 80,247 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు వారంలో బిఎస్‌ఇ టర్నోవర్ 12,518.02 కోట్ల రూపాయలుగా ఉంటే, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 68,942.97 కోట్ల రూపాయలుగా ఉంది. గత వారం బ్యాంకింగ్, చమురు, గ్యాస్, ఐటి, టెక్నాలజీ, పిఎస్‌యు, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, విద్యుత్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. హెల్త్‌కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, లోహ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.