బిజినెస్

వడ్డీరేట్ల కోత అంచనాలతో లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రాబోయే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు మార్కెట్ వ్యాప్తంగా విస్తరించడంతో సూచీలు లాభాల్లో కదలాడాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 25 వేల స్థాయికి ఎగువన 332.63 పాయింట్లు పుంజుకుని 25,285.37 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,700 మార్కును అధిగమించి 99.90 పాయింట్లు పెరిగి 7,704.25 వద్ద నిలిచింది.
క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి, పిఎస్‌యు, ఆటో, చమురు, గ్యాస్ రంగాల షేర్ల విలువ 2.01 శాతం నుంచి 1.18 శాతం వరకు లాభపడింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ లాభపడగా, షాంగై సూచీ నష్టపోయింది. ఇక ఐరోపా మార్కెట్లు ఆరంభంలో లాభాలను అందుకున్నాయి.

‘అక్టోబర్-డిసెంబర్‌లో సిఎడి 1.3 శాతం’
ముంబయి, మార్చి 21: దేశ కరెంట్ ఖాతా లోటు (సిఎడి) ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో జిడిపిలో 1.3 శాతంగా నమోదైందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2014-15) మూడో త్రైమాసికంలో 1.5 శాతంగా ఉన్నట్లు సోమవారం పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో కరెంట్ ఖాతా లోటు 1.7 శాతంగా ఉన్నట్లు వివరించింది. ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్‌లో దేశ జిడిపిలో కరెంట్ ఖాతా లోటు 1.4 శాతంగా ఉందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 1.7 శాతంగా ఉందని చెప్పింది.