బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ఫెడ్ రిజర్వ్, జిఎస్‌టి భయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాలపాలయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ ఒకానొక దశలో 25 వేల స్థాయిని కోల్పోయింది. తిరిగి కోలుకున్నప్పటికీ 207.89 పాయింట్ల నష్టంతో 25,044.43 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం ఒకానొక దశలో 26 వేల స్థాయిని చేజార్చుకోగా, మళ్లీ తేరుకుని 72.85 పాయింట్ల నష్టంతో 7,610.45 వద్ద నిలిచింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్ల పెంపు భయాలు, ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదంపై చెలరేగిన ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఇకపోతే ఈ వారం సెనె్సక్స్ 593.68 పాయింట్లు, నిఫ్టీ 171.45 పాయింట్లు క్షీణించాయి. ఆయా రంగాలవారీగా రియల్టీ, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్, టెలికాం, విద్యుత్ షేర్ల విలువ 2.52 శాతం నుంచి 1.44 శాతం పడిపోయింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.18 శాతం నుంచి 1.22 శాతం దిగజారగా, జపాన్ సూచీ మాత్రం 0.97 శాతం ఎగిసింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు కూడా 0.61 శాతం నుంచి 0.84 శాతం మేర పతనమయ్యాయి.
ఎన్‌ఎస్‌ఇ బాండ్ల వేలం
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) ప్రభుత్వ రుణ సెక్యూరిటీల కొనుగోలుకు విదేశీ మదుపరుల కోసం సోమవారం వేలం నిర్వహించనుంది. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య రెండు గంటలపాటు ఈ వేలం జరగనుండగా, ఈ సందర్భంగా 497 కోట్ల రూపాయల బాండ్లను వేలం వేయనుంది. ఈ నెల 10 నాటికి ప్రభుత్వ రుణ సెక్యూరిటీల్లో విదేశీ మదుపరుల పెట్టుబడుల విలువ 1,29,403 కోట్ల రూపాయలకు చేరింది. 1,29,900 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం ఉంది. దీంతో తక్కువగా ఉన్న మిగతా 497 కోట్ల రూపాయల బాండ్లను సోమవారం ఎన్‌ఎస్‌ఇ వేలం వేస్తోంది.