బిజినెస్

స్వల్పకాలిక, చిన్న రుణాలనివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తక్కువ రుణాలకు కూడా డిపాజిట్లు, ష్యూరిటీలు అడిగి రైతాంగాన్ని, ఇతర వర్గాల ప్రజలను అవస్థలకు గురిచేయవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరారు. సోమవారం సచివాలయం లో ఏర్పాటుచేసిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లక్ష నుండి మూడు లక్షల లోపు రుణాలకు డిపాజిట్లు అంటూ ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. దీనిపై ఎస్‌ఎల్‌బిసి చైర్మన్‌తో తాను మాట్లాడితే ఆయన అంగీకరించారని, ఎస్‌ఎల్‌బిసి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని బ్యాంకర్లను చంద్రబాబు కోరారు. ముద్రా బ్యాంకు 10 లక్షల రూపాయల వరకూ ఇస్తోందని, రైతులకు ఇచ్చే రుణాలకు నిబంధనలు సరికాదని అన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకుంటే అన్నదాతలు ఎలా అభివృద్ధి చెందుతారని సిఎం ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలో వచ్చే జూన్, జూలై నాటికి 10 లక్షల సేద్యపు కుంటలు తవ్వుతామని, లక్ష రెయిన్‌గన్స్ ఏర్పాటు చేస్తామని సిఎం తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇందుకు బ్యాంకులు సహకారం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, ప్రధాన కార్యదర్శి టక్కర్, ఎస్‌ఎల్‌బిసి అధ్యక్షుడు సురేష్ పటేల్, ఆర్‌బిఐ రీజనల్ డైరెక్టర్ ఆర్‌ఎస్ దాస్, నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ హరీష్ జావా, ఆంధ్రా బ్యాంక్ ఆర్‌జిఎం దుర్గాప్రసాద్, సెంట్రల్ బ్యాంక్ ఫీల్డ్ మేనేజర్ రతన్‌కుమార్ పాల్గొన్నారు.